వేణు మాధవ్ చనిపోయారంటూ వార్తలు.. ప్లీజ్ ఆపండి! ఆవేదన చెందిన జబర్దస్త్ రాకేష్

ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితులపై వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు మరింతగా ముందుకెళ్లి ఏకంగా వేణు మాధవ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు సృష్టిస్తున్నారు.

ఇలాంటి వార్తలపై తాజాగా జబర్దస్త్ కమెడియన్ రాకేష్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన చెందాడు. వేణు మాధవ్ మన మధ్య లేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని, ఆయన ఇంకా చికిత్స పొందుతున్నారని పేర్కొంటూ ఓ వీడియో ద్వారా తెలియజేశాడు రాకేష్. దయచేసి సోషల్ మీడియా నియంత్రణ పాటించాల్సిందిగా కోరారు. తాను స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి చూశానని చెబుతూ, ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని చెప్పాడు. ప్లీజ్ ఆపండి.. వేణు మాధవ్ చనిపోయాడని ప్రచారం చేయొద్దంటూ ఆవేదన చెందాడు రాకేష్.

Jabardasth Rakesh reaction on Venu Madhav Death News

టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో వేణు మాధవ్ చనిపోయాడంటూ వస్తున్న వార్తలు చూసి ఆయన తల్లి తీవ్ర కలత చెందుతున్నారని రాకేష్ చెప్పాడు. ఈ పరిస్థితి చూసి ఏం చేయాలో తెలియక ట్విట్టర్ వేదికగా వీడియో ద్వారా అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పాడు. వేణు మాధవ్ ఆరోగ్యం బాగుండాలని అందరూ కోరుకోవాలని.. దయచేసి దుష్ప్రచారం చేయొద్దంటూ విజ్ఞప్తి చేశాడు రాకేష్. మరోవైపు వేణు మాధవ్ ఆరోగ్యం కుదుటపడాలని టాలీవుడ్ ప్రేక్షక లోకం ప్రార్ధిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X