For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి అంటే చాలా ఇష్టం! సెన్సేషన్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

    |

    బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. జులై 21వ తేదీన ప్రారంభమైన ఈ షో చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు? అనే దానిపై బుల్లితెర ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట హాట్ హాట్‌గా మారి చర్చలకు దారి తీస్తున్నాయి.

    ఆరుగురే ఉన్నారు.. అందులో

    ఆరుగురే ఉన్నారు.. అందులో

    15 మంది పార్టిసిపెంట్స్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 నుంచి.. ప్రతీ వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ రాగా, చివరకు ఆరుగురు మాత్రమే మిగిలారు. అలీ, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, శ్రీముఖి మాత్రమే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. దీంతో ఈ ఆరుగురిలో విన్నర్ ఎవరు అవుతారు? ఎవరెవరికి ఏయే సపోర్ట్ లభిస్తుందనేది చర్చనీయాంశం అయింది.

    యాంకర్ శ్రీముఖిపై ఫోకస్.. ఒక్కొక్కరు ఒక్కోలా

    యాంకర్ శ్రీముఖిపై ఫోకస్.. ఒక్కొక్కరు ఒక్కోలా

    ఈ నేపథ్యంలో యాంకర్ శ్రీముఖిపై ఎక్కువగా ఫోకస్ కనిపిస్తోంది. ఆమె తీరుపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుండటంతో బుల్లితెర ప్రేక్షకుల నోళ్ళలో నానుతోంది శ్రీముఖి. ఇటీవలే యాంకర్ రష్మీ శ్రీముఖి గురించి మాట్లాడుతూ సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ శ్రీముఖి గురించి నోరు విప్పాడు.

    శ్రీముఖి అంటే చాలా ఇష్టం.. అందుకే

    శ్రీముఖి అంటే చాలా ఇష్టం.. అందుకే

    జబర్దస్త్ కమెడియన్స్‌తో శ్రీముఖికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. జబర్దస్త్‌లో నటించే చాలా మంది కమెడియన్లు.. శ్రీముఖి యాంకరింగ్ చేసిన పటాస్‌ షోలో పాల్గొన్నారు. ఇలా వారి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. ఈ కారణంగానే శ్రీముఖికి తన సపోర్ట్ అందించాడు జబర్దస్త్ రామ్ ప్రసాద్. తనకు శ్రీముఖి అంటే చాలా ఇష్టమని, దయచేసి అందరూ ఆమెకు సపోర్ట్ చేయండని పేర్కొంటూ వీడియో పోస్ట్ చేశాడు రామ్ ప్రసాద్.

    హేమ.. ఏమందో తెలుసా?

    హేమ.. ఏమందో తెలుసా?

    ఇటీవలే ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన హేమ.. బిగ్ బాస్ రియాల్టీ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత, హిమజ ఎలిమినేట్ అయ్యేంత వరకూ మాత్రమే చూశానని, ఆ తర్వాత షో చూడటం మానేశానని చెప్పి షాకిచ్చింది హేమ.

    శ్రీముఖికి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో!

    శ్రీముఖికి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో!

    ఇలా శ్రీముఖి గురించి పలువురు సెలెబ్రెటీలు భిన్న స్పందన తెలియ జేస్తుండటంతో, బుల్లితెర ఆడియన్స్ రెస్పాన్స్ ఆమెపై ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా బిగ్ బాస్ ఓటింగ్ గురించిన పోస్టులే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సారి విజేత శ్రీముఖి అవుతుందా? లేదా? అనేది.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X