ఉదయ్ కిరణ్ చావుకు అసలు కారణం అదే.. వాళ్ల వల్లే ఆత్మహత్య: కమెడియన్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతూ.. సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తోంది జబర్ధస్త్. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోంది. అలా దీని ద్వారా ఎంతో మంది పరిచయం అయ్యారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో షేకింగ్ శేషు ఒకరు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈయన.. చాలా సినిమాల్లోనూ మెప్పించారు. ఈ నేపథ్యంలో శేకింగ్ శేషు.. ఉదయ్ కిరణ్ మరణంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలను మీరే చూడండి!

జబర్ధస్త్ షోలో ఎంతో గౌరవం : గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు శేకింగ్ శేషు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, ఇప్పుడు అది తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'జబర్ధస్త్ సెట్‌లో నాతో అందరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. సీనియర్లు అయినా నన్న గౌరవంగా పిలుస్తుంటారు. అందరూ డాడీ, బాబాయ్ అని పిలుస్తుంటారు. జడ్జ్‌లు కూడా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడేవారు' అని చెప్పారు.

Jabardasth Shaking Shesu Sensational comments on Uday Kiran Death

ఆ షో వల్లే ఆఫర్లు వచ్చాయి : శేషు కొనసాగిస్తూ.. 'నాకు జబర్ధస్త్‌ వల్లే మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ నా ప్రదర్శన చూసిన తర్వాతే చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కొందరైతే నా స్కిట్లు చూసి అవకాశాలు ఇస్తామని పిలిచారు. సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్' సినిమాలో ఛాన్స్ కూడా అలాగే వచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా జబర్దస్త్‌లో పెట్టిన షేకింగ్ శేషు అనే పేరుతోనే పిలుస్తుంటారు' అని తెలిపారు.

అందుకే జబర్ధస్త్ మానేశా : శేషు కంటిన్యూ చేస్తూ.. 'అనిల్ రావిపూడి గారి దగ్గరకు వెళ్తే సినిమా షూటింగ్ 45 రోజులు ఉంటుంది నీకు ఓకేనా? జబర్ధస్త్ ఏం చేస్తారు అని అడిగారు. నేను రెండూ చూసుకుంటాను సార్ అన్నాను. అప్పుడు ఆయన జబర్ధస్త్ కావాలా..? సినిమా కావాలా..? అని అడిగారు. ఆ తర్వాత షో వాళ్లకు చెబితే ఒప్పుకున్నారు. దీంతో సినిమా చేశా. అలా జబర్ధస్త్ మానేశా' అని వివరించారు.

Jabardasth Shaking Shesu Sensational comments on Uday Kiran Death

చనిపోదాం అనుకున్నాను : ఇదే ఇంటర్వ్యూలో శేషు 'ఒక దశలో అవకాశాలు రాలేదని చచ్చిపోవాలని అనిపించింది. నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి.? సంసారాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లే.. గొప్ప దర్శకుల సినిమాల్లో అవకాశాలు రాకపోతే చాలా బాధగా ఉంటుంది' అంటూ బాధను వ్యక్తం చేశారు.

ఉదయ్ కిరణ్ మృతిపైనా : తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఈ యంగ్ హీరో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో శేకింగ్ శేషు దానిపై స్పదించారు. 'గతంలో హీరో ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాకనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చావుకు అవకాశాలు ఇవ్వని వాళ్లే కారణం' అంటూ సంచలన వ్యాఖ్యలనే చేశారు.

Jabardasth Shaking Shesu Sensational comments on Uday Kiran Death

ఆఫర్లు లేక ఇంటర్వ్యూల్లో : జబర్ధస్త్ కమెడియన్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న శేకింగ్ శేషు.. ఆ తర్వాత ఆ షోను మానేసి సినిమాల్లో నటించారు. ఇలా కొన్నేళ్ల పాటు వరుసగా ఆఫర్లను సొంతం చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత అవకాశాలను అందుకోలేకపోయారు. దీంతో యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించేవారు. అలా ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X