సీక్రెట్ బయటపెట్టిన జబర్దస్త్ వినోద్.. తొలిసారి తీసుకుంది ఇంతే అని చెప్పేశాడు

Recommended Video

Vinod Reveals Interesting Secrets In A Latest Interview || Filmibeat Telugu

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అయ్యారు. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త రకం స్కిట్.. అప్‌డేట్ నవ్వులు అన్నట్లుగా సాగుతోంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పేరు వినోద్. గత కొన్ని రోజులుగా జనం నోళ్ళలో నానుతూ వస్తున్న ఈయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీక్రెట్ బయటపెట్టేశాడు. ఆ వివరాలు చూసేద్దామా..

ఖతర్నాక్ కామెడీ.. టీం సభ్యుల రెమ్మ్యూనరేషన్

ఖతర్నాక్ కామెడీ.. టీం సభ్యుల రెమ్మ్యూనరేషన్

కళాకారులకు మెప్పు పొందటం ఎంత ముఖ్యమో పారితోషికం కూడా అంతే ముఖ్యం. కాబట్టి జబర్దస్త్ టీం సభ్యులు కూడా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటారనేది అందరికీ తెలిసిన సత్యం. అయితే సినీ తారల్లా వీరి రెమ్మ్యూనరేషన్ తాలూకు వివరాలు ఎప్పుడూ చర్చకు రావు. కానీ వినోద్ తాజా ఇంటర్వ్యూలో ఈ టాపిక్ గురించి మాట్లాడటంతో జబర్దస్త్ టీం రెమ్మ్యూనరేషన్ అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఎవ్వరూ చెప్పలేదు.. కానీ జబర్దస్త్ వినోద్

ఎవ్వరూ చెప్పలేదు.. కానీ జబర్దస్త్ వినోద్

జబర్దస్త్ టీం మెంబర్స్ ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటీకీ వారి వారి రెమ్మ్యూనరేషన్ వివరాలు మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. కానీ తాజాగా జబర్దస్త్ వినోద్ మాత్రం తన రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర విషయాలు చెప్పి ఆ సీక్రెట్ రివీల్ చేశాడు. జబర్దస్త్ షోలో అడుగు పెట్టిన కొత్తలో తనకు ఒక్కో ఎపిసోడ్‌కు 1000 రూపాయలు ఇచ్చేవారని చెప్పాడు.

ఇతరులు, ఇప్పటి సంగతి మాత్రం

ఇతరులు, ఇప్పటి సంగతి మాత్రం

కెరీర్ మొదలైన తొలి రోజుల్లో తన రెమ్మ్యూనరేషన్ ఎంతనేది వెల్లడించిన వినోద్.. ఇప్పటి సంగతి మాత్రం చెప్పలేదు. అలాగే తన తోటి పార్టిసిపెంట్స్ రెమ్యూనరేషన్ తాలూకు వివారాలు ఏవీ కూడా ప్రస్తావించలేదు. తన పనేదో తాను చేసుకుని వెళ్లడమే తప్పించి మిగతా టీమ్ సభ్యుల పారితోషికం, ఇతరత్రా వివరాల గురించి తానూ ఏనాడూ పట్టించుకోలేదని చెప్పాడు.

వినోద్ పై దాడి.. ఇప్పుడిప్పుడే

వినోద్ పై దాడి.. ఇప్పుడిప్పుడే

వినోద్ అలియాస్ వినోదినిపై ఇటీవలే దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆస్తి కొనుగోలు విషయమై జరిగిన గొడవ కారణంగా ఈయనపై దాడి జగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత చికిత్స తీసుకొని కాస్త కోలుకున్న ఈయన ఇప్పుడిప్పుడే కెరీర్ గురించి ఆలోచిస్తున్నాడు.

రోజు ఏడుపే.. వినోద్ ఆవేదన

రోజు ఏడుపే.. వినోద్ ఆవేదన

తనపై జరిగిన ఈ దాడి కారణంగా తన కన్ను చిన్నగా అయిందని, ఇక తనకు లేడీ గెటప్ సూట్ కాదేమో అని ఆవేదన చెందాడు వినోద్. దీంతో ఇక అవకాశాలు కూడా రావేమో అని భయం వేస్తోంది. ఆ కన్నును రోజూ అద్దంలో చూసుకుని ఏడుస్తున్నాను అంటూ విలపించాడు వినోద్. కానీ చివరకు మాత్రం తన కెరీర్ పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు వెల్లడించాడు ఈ కమెడియన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X