For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలి.. స్టార్ ప్రొడ్యూసర్‌పై విరుచుకుపడ్డ ఆది.. పవన్‌ను టార్గెట్ చేసినందుకేనా?

  |

  మెగా హీరోలపై ఎవరైనా కామెంట్ చేసినట్టు అనిపిస్తే వారిని చీల్చి చెండాడటంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కాస్త ముందున్నట్టే కనిపిస్తాడు. గతంలో కొందరిని సోషల్ మీడియాలోను. టెలివిజన్ మీడియాలోనూ ఆటాడేసుకొన్న సందర్భాలు కనిపిస్తాయి. తాజాగా టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్, పారిశ్రామికవేత్త పొట్లూరి వీర ప్రసాద్‌(పీవీపీ)పై హైపర్ ఆది కాస్త ఘాటుగా కారాలు మిరియాలు నూరినట్టు కనిపించింది. పీవీపై ఆది విరుచుకుపడటానికి కారణమేమిటంటే...

  ముంబైలో చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగి వీడియో

  ముంబైలో చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగి వీడియో

  ఇటీవల ముంబైకి సమీపంలోని ఓ స్టేషన్‌లో వేగంగా ట్రైన్ వస్తున్న సమయంలో ఓ చిన్నారి పట్టాలపై ఉండటాన్ని చూసి రైల్వే పాయింట్స్‌మెన్ తన ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వీడియోను షేర్ చేసి అభినందించారు.

  పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారనే అభిప్రాయంతో

  పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారనే అభిప్రాయంతో

  అలాంటి ట్రెండింగ్ వీడియోను నిర్మాత పీవీపి షేర్ చేసి తన స్పందన పంచుకోవడం వరకు బాగానే ఉంది. కానీ ఆ వీడియోతోపాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా టార్గెట్ చేసుకొన్నారనే విషయం స్పష్టంగా కనిపించింది. ఆ మెసేజ్ మెగా ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించే విధంగానే కనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  ట్విట్టర్‌లో నిర్మాత పీవీపీ కామెంట్ ఇదే

  ట్విట్టర్‌లో నిర్మాత పీవీపీ కామెంట్ ఇదే

  వైరల్ వీడియోను నిర్మాత పీవీపీ షేర్ చేస్తూ.. రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు. లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ Jawa బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా, కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్‌కి కొడదాం బ్రదర్స్ అంటూ ట్విట్టర్‌లో ఓ మెసేజ్ షేర్ చేశారు.

  పీవీపీ దిమ్మతిరిగేలా హైపర్ ఆది ట్వీట్

  పీవీపీ దిమ్మతిరిగేలా హైపర్ ఆది ట్వీట్

  ఇక పీవీపీ షేర్ పెట్టిన మెసేజ్‌పై జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా స్పందించారు. నీలాంటి లంగా బాబులు కోట్లు ఉన్నా కబుర్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి సాయం చెయ్యరు. పులి ని చూసి నక్క వాత ట్టుకోవడం అంటే ఇదే. సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళన‌గా మాట్లాడుతున్న నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలి అని జనాలు అనుకుంటున్నారు అంటూ ఓ మెసేజ్‌తో పీవీపీ ట్వీట్‌ను హైపర్ ఆది రీట్వీట్ చేశారు.

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  వివాదంలోకి 50 కోట్ల రెమ్యునరేషన్

  వివాదంలోకి 50 కోట్ల రెమ్యునరేషన్

  నిర్మాత పీవీపీ చేసిన ట్వీట్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిందే అంటూ మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో వకీల్ సాబ్‌ కోసం పవన్ కల్యాణ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో పీవీపీ చేసిన ట్వీట్ తనను ఉద్దేశించిందనే భావన కలిగింది. ఇంతకు పీవీపీ చేసిన ట్వీట్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసినదా? లేక మరొకరిని టార్గెట్ చేసి చేసిందా అనే విషయం సదరు నిర్మాత స్పందిస్తే గానీ ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

  English summary
  Jabardasth's comedian, Actor Hyper Aadi reacted heavily on Producer PVP tweet. He has given befitting reply to Producer Prasad V Potluri Who targets Hero Pawan Kalyan indirectly. Hyper Aadi angry reply to PVP.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X