చిరంజీవి పుట్టినరోజు వేడుకలో ‘జై జనసేన’ అన్న జబర్ధస్త్ కమెడియన్.. దద్దరిల్లిన ఆడిటోరియం

మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా బుధవారమే భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతోంది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథులు విచ్చేస్తున్నారు.

మెగా అభిమానులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే చాలా మంది శిల్పకళావేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో హైటెక్ సిటీ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. అదే సమయంలో ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. ఈ ఫంక్షన్ వల్ల హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కూడా రద్దీగా ఉంది. వాస్తవానికి ఉదయం నుంచే చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద పాసుల కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. చివరకు పాసులు దక్కించుకుని వేడుకకు చేరుకుంటున్నారు.

Jabardhast Team Hulchal In Chiranjeevi Birthday Function

ఇక, ఈ వేడుకలో జబర్ధస్త్ టీమ్ సందడి చేసింది. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, రాకెట్ రాఘవ, ఫసక్ శశి, అవినాష్, నాగి, రైజింగ్ రాజు, రాకింగ్ రాకేష్, సుధాకర్, బాబీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరూ ఒక్కొక్కరిగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో ఫ్యాన్స్‌ను ఉత్తేజ పరిచే స్లోగన్స్ ఇచ్చారు. వీరిలో బాబీ ఓ అడుగు ముందుకేసి 'మెగాస్టార్.. పవర్‌స్టార్.. జై జనసేన' అని అరవడంతో ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. ఇక, చివర్లో అందరూ ముఠా మేస్త్రీ సినిమాలోని పాటకు స్టెప్ వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X