'అదుర్స్' తెలంగాణాలో విడుదల చేస్తే అప్పుడు...
జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన 'అదుర్స్' చిత్రం తెలంగాణాలో విడుదలయినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసని ఓయూ జెఎసి ప్రకటించింది. ఆదివారం జరిగిన సమావేశంలో ఈ చిత్రం ప్రస్ధావన వచ్చినప్పుడు పై విధంగా స్పందించింది. మేం ఇంతకుముందే అదుర్స్ ని తెలంగాణాలో విడుదల చేయటానికి వీల్లేదని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ని కోరాం...అయినా కాదని రిలీజ్ చేస్తే అడ్డుకుంటామని అన్నారు. అలాగే ఆంధ్రా నటుల సినిమాలు ఏవీ తమ ప్రాంతంలో రిలీజ్ చెయ్యకూడదని వారు చేసిన డిమాండ్స్ లో తెలియచేసారు. ఇక తెలంగాణ ఏరియాల్లో రిలీజు కోసం దిల్ రాజు ఆధ్వర్యంలో పలు మార్లు మీటింగ్ లు జరిగినట్లు సమాచారం. మరో ప్రక్క జేఎసి భారీ మొత్తాలను రిలీజ్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు అంతటా వినపడుతోంది. అదుర్స్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వివివినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార,షీలా హీరోయిన్స్ గా గ్లామర్ పంచారు.ఇక దిల్ రాజు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా బృందావనం అనే చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











