దిల్ రాజు కి దమ్ముంటే...తెలంగాణ జెఎసి సవాల్
నిర్మాత దిల్ రాజుకు దమ్ముంటే తెలంగాణలోని వారిని ఎంపిక చేసి వారినే హీరోలుగా, హీరోయిన్స్ గా, విలన్లుగా పెట్టి సినిమా తీయాలని జెఎసి నాయకులు అన్నారు. దిల్ రాజు దిష్టిబొమ్మను గురువారం నాంపల్లిలోని తెలుగు వర్శిటీ జెఎసి విద్యార్దులు దగ్ధం చేసారు. ఈ సందర్బంగా జెఎసి నాయుకుడు వినోద్ మాట్లాడుతూ తెలంగాణలో ఆర్య-2 చిత్రాన్ని ప్రదర్శిస్తే ఎక్కడైనా అడ్డుకోవటానికి విధ్యార్ది లోకమంతా సిద్దంగా ఉందని అన్నారు. తెలంగాణాలో పుట్టి తెలంగాణ వ్యతిరేకంగా సమైక్యవాదుల చిత్రాలను ప్రదర్శిస్తే నీ ఇల్లు ముట్టడిస్తామని అన్నారు. తెలుగు చిత్రసీమలో ఎన్నో చిత్రాలను నిర్మిస్తున్నా వదిలేసామని, సమైఖ్యాంద్ర అన్న మోహన్ బాబు, చిరంజీవి వారసుల సినిమాలను ప్రదర్శస్తే తెలంగాణలోని ధియోటర్లులో యజమానులను తరమి కొడతామని అన్నారు. దిల్ రాజుకు దమ్ముంటే తెలంగాణ ప్రాతంలోని వారితోనే సినిమా చేసి చూపాలని సవాల్ విసిరారు.దిల్ రాజు..ఆర్య-2 తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ కావటం వారి ఆగ్రహానికి కారణమైంది. అలాగే దిల్ రాజు తెలంగాణలో చిత్రాలు తీసి తెలంగాణ సినీ పరిశ్రమకు సేవ చెయ్యాలని బారీ ఎత్తున నినాదాలు చేసారు.


Click it and Unblock the Notifications











