భారతీయ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వండి : జాకీ చాన్

ఈ సందర్భంగా జాకీ చాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. "వాస్తవానికి నేనో మంచి నటుడిని. కేవలం ఫైట్ ఫైట్ ఫైటే కాదు" అని నవ్వుతూ అన్నాడు. భారత దర్శకులు మంచి పాత్రలతో తనకు ఆహ్వానం పలుకుతారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. యాక్షన్ నటుడు అనే ముద్ర నుంచి బయటపడి నటుడిగా గుర్తింపును పొందాలనుకుంటున్నానని తెలిపాడు.
పదేళ్ల క్రితం మల్లికా షెరావత్‌తో కలిసి నటించిన 'The Myth' సినిమా కోసం భారత్‌లో నెల రోజుల పాటు ఉన్నాను. ఆ సమయంలో ఎన్నో ఇండియన్ చిత్రాలు చూసాను. సింగింగ్ అండ్ డాన్సింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను కూడా మంచి డాన్సర్నే అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్-చైనా మధ్య మంచి సంబంధాలు ఉండాలని, ద్వేషాలు వద్దని ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











