రజనీ కోసం ఏదైనా చేస్తానంటున్న పంజా విలన్

By Bojja Kumar

రజనీకాంత్ హీరోగా ఆయన కూతురు సౌందర్య దర్శకత్వ బాధ్యతలు చేపట్టి 'కొచ్చాడయాన్' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ ''రజనీకాంత్ కూతురు సౌందర్య వచ్చి తనను గెస్ట్ రోల్ చేయమని అడిగింది. నేను వెంటనే ఒప్పుకున్నాను. రజనీలాంటి స్టార్ తో నటించడం నాకు ఎంతో ఇష్టమైన విషయం, ఆయన కోసం ఎలాంటి పాత్రైనా చేస్తా'' అని చెప్పుకొచ్చారు. జాకీ ష్రాఫ్ ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'పంజా' సినిమాలో మెయిన్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ స్ర్కిప్టు అందించడంతో పాటు, దర్శకత్వంలో కొత్తగా అడుగు పెట్టిన సౌందర్యకు దగ్గరుండి మెలకువళు నేర్పిస్తున్నారు. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అయితే రజనీ సరసన నటించేది తార ఎవరు? అనేది ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్‌ క్యాప్చరింగ్‌ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్‌', 'ద అడ్వెంచర్‌ ఆఫ్‌ టిన్‌టిన్‌' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X