»   »  ఆమెతో తిరగొద్దంటూ హీరో కి తల్లి వార్నింగ్ , అదేం లేదంటూ తండ్రి మీడియాతో

ఆమెతో తిరగొద్దంటూ హీరో కి తల్లి వార్నింగ్ , అదేం లేదంటూ తండ్రి మీడియాతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మోడరన్ యుగంలో డేటింగ్ లు,సహ జీవనం కాన్సెప్ట్ లు కామన్ అయ్యిపోయాయి. పెద్దలు ఎంత మొత్తుకున్నా యూత్ మాత్రం వీటికే ఓటేస్తున్నారు. ముఖ్యంగా సినీ ప్రపంచంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది అతి సాధారణ వ్యవహారం అయ్యిపోయింది. ఇంతకు ముందు రోజుల్లో వేరైనా ఇప్పుడు ఎవరూ వింతగా ఆ పదం వినపడగానే చూడటం లేదు. అయితే తల్లితండ్రుల మాత్రం ఇప్పటికీ ఏక్సెప్టు చేయలేకపోతున్నారనేది మాత్రం నిజం.

రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కు అదే సమస్య వచ్చింది. అతను గర్ల్ ప్రెండ్ దిశా పటాని. ఈమె డేటింగ్ యవ్వారం గురించి ఓ వైపు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. లేటెస్ట్‌గా ప్రియుడితో కలిసి హాలీడే ట్రిప్‌ వేసినట్టు సమాచారం.

గతంలో వీళ్ల డేటింగ్ గురించి మీడియా ప్రశ్నించినప్పటికీ అలాంటిదేమీ లేదని తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఐతే...కొద్దిరోజులు కిందట టైగర్ ష్రాఫ్ - దిశాపటాని కలిసి టూరేసిన ఫిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో హీరోగారి తల్లి ఆయేషా ష్రాఫ్ మాత్రం వీటికి నో చెప్తోందని వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా దిశా కు దూరంగా ఉండమని తల్లి వార్నింగ్ ఇచ్చిందని, దాంతో దిశాను దూరం పెట్టడానికే రెడీ అయ్యినట్లు చెప్పుకున్నారు. కానీ ఈ విషయమై హీరో గారి తండ్రి మాజీ హీరో జాకీ ష్రాఫ్ మాత్రం వేరేగా స్పందించాడు.


సీనియర్ హీరో జాకీష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యుడవటంతో ఇండస్ట్రీలో తక స్కిల్స్ ని మాత్రమే నమ్ముకుని హీరోపంతి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. టైగర్ ష్రాఫ్ యాక్షన్ స్టంట్స్ చూసి స్పెల్ బౌన్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు చేస్తున్న రెండో సినిమా భాగీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

 అంత పెద్ద మ్యాటర్ కాదు..

అంత పెద్ద మ్యాటర్ కాదు..

జాకీష్రాఫ్ ఓ లీడింగ్ మీడియాతో మాట్లాడుతూ... "అదే మీ జనాలు మాట్లాడుకునేంత పెద్ద విషయం ఏమీ కాదు. దిశా, టైగర్ ఇద్దరూ ఏమీ విడిపోలేదు. వారు ఫ్రెండ్స్ గానే ఉన్నారు. అలాగే పెద్దలమైన మేము పిల్లల విషయాల్లో కలగచేసుకోం, వాళ్లను వదిలేయండి , ప్లేజ్, మేం చాలా కూల్ గా ఉన్నాము!" అని తేల్చి చెప్పారు.

 నేను దాచాలనుకోవటంలేదు..నిజమే

నేను దాచాలనుకోవటంలేదు..నిజమే

. మీ ఇద్దరిపై వస్తున్న పుకార్లు విని చింతిస్తున్నారా అని ప్రశ్నించగా.. లేదు, నటుడిగా ఉన్న ప్పుడు ఇవన్నీ సాధారణమే కదా.. పెద్దగా ఆలోచించ డం లేదంటూ చెప్పాడు. మరి దిశతో మీ రిలేషన్ మాటేంటి అని ప్రశ్నించగా..'అవును, మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేను దాచా లనుకోవడం లేదు. ఆమెతో సమయం గడపడం నాకిష్టం. బయట తిరు గుతాను, కాఫీకి కూడా వెళ్తుంటాం. అయితే మాత్రం ఏమీ లేదు' అంటూ బదులిచ్చాడు ఈ యువ హీరో.

ఇంకొకరిని సైతం లైన్లో పెట్టేసాడు

ఇంకొకరిని సైతం లైన్లో పెట్టేసాడు

ఇప్పటికే దిశాతో డేటింగ్ చేస్తున్న టైగర్ తన రెండో సినిమా భాగీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆశిఖి హీరోయిన్ శ్రద్దాకాపూర్ టైగర్ ష్రాఫ్ కళలకి ఫ్లాట్ అయిపోయి అతని లవ్ లో పడిందట. టైగర్ ఎక్కడికి వెళ్ళినా విడవకుండా అతనితోనే వెళుతుందట. దాంతో ఫస్ట్ లవర్ కు కాలుతోందిట.

 హోటల్లో దొరికిపోయింది

హోటల్లో దొరికిపోయింది

దిశాప‌టాని ముంబైలోని ఓ హోటెల్‌లో త‌న ప్రియుడితో స‌న్నిహితంగా మెలుగుతూ మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసింది. గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ యువ హీరో టైగ‌ర్ షార్ఫ్ తో డేటింగ్ చేస్తోంది దిశా. వీళ్లిద్ద‌రూ.. ఫారెన్‌లో న‌డిరోడ్ల‌పై షికారు చేస్తూ.. దొరికేశారు. అప్ప‌ట్లో దిశాని ఈ వ్య‌వారంపై అడిగితే.. అలాంటిదేం లేద‌ని త్రోసి పుచ్చింది. ఇప్పుడు మాత్రం ముంబైలోని ఓ హోటెల్‌లో ఇద్ద‌రూ జాయింటుగానే దొరికేసిన‌ట్టు టాక్‌.

 ఓనమాలు దిద్దింది తెలుగులోనే

ఓనమాలు దిద్దింది తెలుగులోనే


గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ చిత్రంతో దిశాపటాని టాలీవుడ్‌కు పరిచయమైంది. మోడలింగ్ నుంచి చిత్రసీమవైపు అడుగులు వేసిన ఈ సుందరి ఈ సినిమాతోనే నటనలో ఓనమాలు దిద్దింది. తెలుగులో కెరీర్‌ను మొదలుపెట్టిన దిశాపటాని ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిసారిస్తోంది.

 జాకీఛాన్ తో ..

జాకీఛాన్ తో ..

క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా రూపొంది రిలీజైన ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో ధోనీ ప్రియురాలి పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో పాటు జాకీచాన్‌తో కలిసి నటిస్తోన్న కుంగ్ ఫూ యోగా చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది.

 అందుకే జాకీకు జోడీ

అందుకే జాకీకు జోడీ

జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉన్న ఈ బ్యూటి, ఈ సినిమాలో జాకీకి జోడిగా నటిస్తోందట. సోనూసూద్, అమైరా దస్తర్ లాంటి భారతీయ నటులు నటిస్తున్న ఈ సినిమా కథ ఇండియా, చైనాల నేపథ్యంలో సాగుతోంది.

నిధిని చేజిక్కింకునేందుకు

నిధిని చేజిక్కింకునేందుకు

టిబెట్ లో ఉన్న ఒక నిధి వేటలో భాగంగా ఇండియాకు వచ్చే జాకీచాన్ కు, ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లో పనిచేసే దిశ సాయం చేస్తోంది. ఇద్దరు కలిసి ఆ నిధిని ఎలా సాధించారు అన్నదే సినిమా కథ. కథా పరంగా దిశాపటానీ లీడ్ హీరోయిన్ అనిపిస్తోంది. మరి ఈ ఛాన్స్ తో దిశ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి

 నేను యాంటీ సోషల్ ని

నేను యాంటీ సోషల్ ని

పర్శనల్ లైఫ్ పై వచ్చే రూమర్స్ మిమ్మల్ని బాధించవా అంటూ రీసెంట్ గా ఓ లీడింగ్ న్యూస్ ఏజెన్సీ వారు దిశాని ప్రశ్నించారు. దానికి దిశా చాలా కూల్ సమాధానమిచ్చి షాక్ ఇచ్చింది. నేను ఓ ఏంటి సోషల్ ని , నా ఇంట్లో న్యూస్ పేపర్లు కూడా ఉండవు అని చెప్పకొచ్చింది.

 సినిమా న్యూస్ నాకెందుకు

సినిమా న్యూస్ నాకెందుకు

నా దగ్గర ఓ యాప్ ఉంది. దాని ద్వారా నేను ఇంపార్టెంట్ న్యూస్ లు ఫాలో అవుతాను. కానీ బాలీవుడ్ న్యూస్ ని అసలు పట్టించుకోను. అందులో నా గురించి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నా నాకు తెలియదు. కాబట్టి రూమర్స్ అయినా మరొకటి అయినా నా దాకా రావు అని చెప్పింది దిశా.

 అందరూ సంపాదించుకోవటానికే

అందరూ సంపాదించుకోవటానికే

రూమర్స్ నన్ను ఎప్పుడూ బాధించవు. అవి నా చెవిని పడ్డా వాటిని నేను లెక్క చెయ్యను. నన్ను అవి బాధించవు. నాకు తెలిసి అందరు అన్ని రకాలుగా డబ్బు చేసుకుంటున్నారు. రూమర్స్ క్రియేట్ చేసి మరీ, వాటిని నేను ఎందుకు చెడకొట్టడం అని చెప్పింది దిశా.

 నా గురించి జనం చదవటం అదృష్టమే

నా గురించి జనం చదవటం అదృష్టమే

రూమర్స్ కావచ్చు, న్యూస్ కావచ్చు, మరొకటి కావచ్చు, నా గురించి, నా పర్శనల్ లైఫ్ గురించి జనం ఆసక్తిగా చదవటం అనేది మంచి విషయమే. అలా నేను లక్కీ పర్శన్ నే. అందుకనే నేను రూమర్స్ మీద మరొక దాని పైనా కంప్లైంట్స్ చేయను. వారి ఆనందానికి నేను ఉపయోగపడుతున్నా బస్.

 మీరు రూమర్ క్రియేట్ చేసి నన్ను సమాధానం చెప్పమంటే ఎలా..

మీరు రూమర్ క్రియేట్ చేసి నన్ను సమాధానం చెప్పమంటే ఎలా..

ఎవరో ఊహించనివి నా జీవితంలో జరగాల ని లేదు కదా. అది వారి అభిప్రాయం , లేదా ఊహ లేదా క్రియేటివిటీ. అందుకు నేను భాధ్యురాలిని కాదు. కాబట్టి మీ ఊహలతో రూమర్స్ క్రియేట్ చేసి వాటి గురించి నన్ను ప్రశ్నిస్తే ఉపయోగం లేదు. నేను హ్యాపీ గా ఉన్నా. అంతవరకే నేను ఆలోచిస్తాను అని మెచ్యూరిటీగా సమాధానమిచ్చింది దిశా.

 సేమ్ టు సేమ్ నాలాగే

సేమ్ టు సేమ్ నాలాగే

నేను టైగర్ గుడ్ ఫ్రెండ్స్ ఎలా అయ్యామంటే మేమిద్దరం చాలా విషయాల్లో ఒకేలా ఆలోచిస్తాం. ఒకేలా బిహేవ్ చేస్తాం. నాకు తెలిసి నాలాగే టైగర్ కూడా న్యూస్ పేపర్లు చదవడం. చాలా ఫోకస్డ్ గా ఉంటాడు. వృత్తిలోనే నిమగ్నమై ఉంటాడు. అంటూ చెప్పుకొచ్చింది దిశా.

 ఉదయం లేచింది మొదలు

ఉదయం లేచింది మొదలు

ఉదయం త్వరగా లేవటం, జిమ్నాస్టిక్స్ కు వెళ్లటం, రోజంతా రాత్రి ఎనిమిది దాకా షూటింగ్ లేదా వర్కవుట్స్ అంటూ బిజీగా ఉంటాడు. బయిట ప్రపంచం తక్కువే అంటూ టైగర్ గురించి ఆమె వివరించింది. రోజూ వారి దినచర్య పూర్తిగా డిఫెరంట్ గా ఉంటుందని చెప్పింది.

English summary
A few days ago, it was reported that Tiger Shroff's mother Ayesha Shroff does not like his rumoured girlfriend Disha Patani. And yesterday, many reports claimed that the couple has already broken up because of Ayesha, as she has told Tiger to stay away from Disha. But now Jackie Shroff has put all the rumours to rest by telling this to a leading daily, "It doesn't matter what anyone says. Disha and Tiger are friends and we're cool with it. Let them be, please!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu