శ్రీలంకలో ద్వీపం కొనుక్కున్న హాట్ హీరోయిన్
శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర కొనుక్కున్న ద్వీపానికి సమీపంలోనే ఈ ద్వీపం ఉంది. కొన్ని నెలల క్రితం వరకు ఉగ్రవాదం కోరల్లో విలవిలలాడిన శ్రీలంక దాని నుంచి విముక్తి లభించడంతో ప్రస్తుతం ఇక్కడ పర్యాటక రంగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పుంజుకుంది. శ్రీలంకకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్ధిరాస్ధిగానూ ఇక్కడి ద్వీపాలను ప్రముఖులు కొనుగోలు చేయడం గమనించదగ్గ విషయం.
ఈ విషయమై బాలీవుడ్ ప్రముఖుడు ఒకరు విశ్లేషిస్తూ... భాష ఏదైనప్పటికీ సినిమాల్లో నటించే నటీనటులకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులుంటారు. ఈ ప్రముఖులు కాలు బయటపెడితే చాలు వారిని ఒక్కసారి అయినా చూడాలని సామాన్యులు ఉవ్విళ్లూరుతారు. అందుకే పేరున్న సినిమా స్టార్లకు ఏకాంతం లభించాలంటే అది గగనకుసుమమే. తమ కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడపాలనుకునే బాలీవుడ్ నటులు తరచుగా విదేశాలు ప్రయాణమవుతుంటారు. అలాంటప్పుడు ఇలా ద్వీపాలు కొనుగోలు చేయటం అవసరమే అన్నారు. ఇక ఈ శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూట్ లో ఇంకెత మంది బాలీవుడ్ స్టార్స్ ప్రయాణిస్తున్నారో చూడాలి.


Click it and Unblock the Notifications












