పెళ్లి వేడుకలో హీరోయిన్ డాన్స్: రూ. 4 కోట్లకు డీల్ ఓకే

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ పెర్నాండెజ్ ఓ పెళ్లి వేడుకలో డాన్స్ చేసేందుకు భారీ డీల్ తన ఖాతాలో వేసుకుంది. లండన్లో జరిగే ఓ పెళ్లి వేడుకలో ఆమె డాన్స్ చేసేందుకు గాను ఓ వ్యాపార వేత్త సంప్రదించగా రూ. 4 కోట్లు డిమాండ్ చేసింది. ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు సదరు వ్యాపార వేత్త ఓకే చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె ప్రతినిధి కూడా ధృవీకరించారు.

శ్రీలంకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో 'అలాడిన్' అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జానె కహా సే ఆయా హై, హౌస్ ఫుల్ చిత్రాల్లో నటించినప్పటికీ.....ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం మహేష్ భట్ మూవీ 'మర్డర్-2' చిత్రం ద్వారానే. సల్మాన్ ఖాన్ తో నటించిన ‘కిక్' చిత్రం విజయం సాధించడంతో అమ్ముడుకి డిమాండ్ పెరిగింది.

ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా....అమ్ముడికి స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు. ఆయా చిత్రాల్లో సెకండ్ లీడ్ పాత్రలకు మాత్రమే పరిమితం అయింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న హీరో, బంగిస్తాన్, బ్రదర్స్, డెఫెనిషన్ ఆఫ్ ఫియర్(హాలీవుడ్) చిత్రాల్లో నటిస్తోంది..

Jacqueline Fernandez Demands Rs. 4 Crore to Dance at a Wedding in London

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫాదర్ శ్రీలంకన్, మదర్ మలేషయిన్. ఆమెకు 3 ఏళ్ల వయసున్నప్పుడే వారి కుటుంబం బహ్రెయిన్‌కు షిప్ట్ అయ్యారు. ఆమె బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచింది. ఆగస్టు 11, 1985న జాక్వెలిన్ జన్మించింది. మోడలింగ్ రంగంలోకి... ఆస్ట్రేలియాలో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన జాక్వెలిన్...తర్వాత శ్రీలంక తిరిగొచ్చి మొడలింగ్, టెలివిజన్ రిపోర్టింగ్, హోస్టింగులో ప్రవేశించింది.

మిస్ శ్రీలంక యూనివర్స్ 2006లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల పోటీల్లో మిస్ శ్రీలంక యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. 2007లో శ్రీలంక సింగింగ్ సెన్సేషన్ బాతియా, సంతుష్ మ్యూజిక్ వీడియోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తొలి కమర్షియల్ అప్పియరెన్స్ ఇచ్చింది. 2009లో అలాడిన్ అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్. అయితే ఆమె నటించిన తొలి మూడు సినిమాలు ప్లాపయ్యాయి. అయితే నాలుగో సినిమా ‘మార్డర్-2' హిట్ కావడంతో అమ్మడుకి గుర్తింపు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X