twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుదేవా చిత్రంలో హాట్ హీరోయిన్ ఐటం సాంగ్..

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రభుదేవా తను డైరక్ట్ చేసే చిత్రాల్లో అన్ని మసాలాలు ఉండాలని కోరుకుంటాడు. తాజాగా ఆయన ఐటం సాంగ్ లకు తగినంత ప్రాముఖ్యత ఇస్తారు. దాంతో హీరోయిన్స్ ...ఆయన దర్శకత్వంలో డాన్స్ చేసి మెరవటానికి ఉత్సాహం చూపిస్తూంటారు. తాజాగా ఆ లిస్ట్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేరింది. ప్రభుదేవా తాజాగా బాలీవుడ్ లో డైరక్ట్ చేస్తున్న 'రామయ్య వస్తావయ్యా' చిత్రంలో టైటిల్ సాంగ్‌కు ఈమె తన అందచందాలను ప్రదర్శించనుంది. ఈ చిత్రం జూన్ 7, 2013న విడుదల కానుంది.

    అందాల కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మోడల్‌, నటి అయిన జాక్వెలిన్‌ మర్డర్‌-2, హాస్‌ఫుల్‌-2 చిత్రాల ద్వారా బాలీవుడ్‌లో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక 'రౌడీరాథోడ్‌'తో హిట్ కొట్టిన ప్రభుదేవా తాజాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'చిత్రం హిందీలోకి రామయ్య వస్తావయ్యా అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష చేసిన పాత్రకు గానూ శృతి హాసన్ ని ఎంపిక చేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుదేవా మాట్లాడుతూ...మేము ఈ చిత్రం కోసం కొత్త అమ్మాయిని అనుకున్నాము. అయితే శృతి హాసన్ బెస్ట్ ఛాయిస్ అనిపించింది అని చెప్పారు.

    ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్న విక్రమార్కుడు రీమేక్ గా 'రౌడీరాథోడ్‌'రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అతని దృష్టి తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'పై పడింది. త్రిష,సిద్దార్ద కాంబినేషన్ లో ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ ఘన విజయం సాధించింది. దాంతో హిందీలోనూ ఈ సినిమా వర్కవుట్ అవుతుందని భావించి చేస్తున్నారు.హిందీ రీమేక్‌కి కుమార్‌ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్‌ హీరోగా పరిచయం కాబోతున్నారు.

    ఈ సినిమాలో హీరో గిరీష్‌తో కలిసి ఓ ప్రయాణ గీతంలో జాక్వెలిన్ ఆడిపాడనుందని, మధ్యలో ప్రభుదేవా కూడా వచ్చి వీరితో స్టెప్పులేయనున్నట్లు సమాచారం. అయితే ఇది ఛయ్య ఛయ్య పాటలాంటిది మాత్రం కాదని చిత్ర నిర్మాత కుమార్ తౌరానీ తెలిపారు. తౌరానీ తనయుడు గిరీష్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..' పేరుతో విడుదలై ప్రేక్షకాదరణను పొందిన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు ప్రభు. ఇందులో కేవలం ఓ పాటలో మాత్రమే జాక్వెలిన్ కనిపించనుందని, అయితే సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తౌరాని చెబుతున్నారు.

    English summary
    
 The jacqueline fernandez new item song titled “Jaadu Ki Jhappi De De Tu Abhi” will see her shake her leg in the upcoming Indian romantic film Ramaiya Vasta Vaiya directed by Prabhu Deva. The movie features Girish Kumar and Shruti Haasan in the lead roles and is set to release in 7th June 2013. The movie is a remake of one of the telugu super hit movie Nuvvostanante Nenoddantana. This peppy item number was a 3 day shoot at punjab choreographed by none other than Prabhu Deva.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X