Don't Miss!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రభుదేవా చిత్రంలో హాట్ హీరోయిన్ ఐటం సాంగ్..
అందాల కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మోడల్, నటి అయిన జాక్వెలిన్ మర్డర్-2, హాస్‌ఫుల్-2 చిత్రాల ద్వారా బాలీవుడ్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక 'రౌడీరాథోడ్'తో హిట్ కొట్టిన ప్రభుదేవా తాజాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'చిత్రం హిందీలోకి రామయ్య వస్తావయ్యా అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష చేసిన పాత్రకు గానూ శృతి హాసన్ ని ఎంపిక చేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుదేవా మాట్లాడుతూ...మేము ఈ చిత్రం కోసం కొత్త అమ్మాయిని అనుకున్నాము. అయితే శృతి హాసన్ బెస్ట్ ఛాయిస్ అనిపించింది అని చెప్పారు.
ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్న విక్రమార్కుడు రీమేక్ గా 'రౌడీరాథోడ్'రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అతని దృష్టి తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'పై పడింది. త్రిష,సిద్దార్ద కాంబినేషన్ లో ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ ఘన విజయం సాధించింది. దాంతో హిందీలోనూ ఈ సినిమా వర్కవుట్ అవుతుందని భావించి చేస్తున్నారు.హిందీ రీమేక్‌కి కుమార్ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్ హీరోగా పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమాలో హీరో గిరీష్‌తో కలిసి ఓ ప్రయాణ గీతంలో జాక్వెలిన్ ఆడిపాడనుందని, మధ్యలో ప్రభుదేవా కూడా వచ్చి వీరితో స్టెప్పులేయనున్నట్లు సమాచారం. అయితే ఇది ఛయ్య ఛయ్య పాటలాంటిది మాత్రం కాదని చిత్ర నిర్మాత కుమార్ తౌరానీ తెలిపారు. తౌరానీ తనయుడు గిరీష్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..' పేరుతో విడుదలై ప్రేక్షకాదరణను పొందిన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు ప్రభు. ఇందులో కేవలం ఓ పాటలో మాత్రమే జాక్వెలిన్ కనిపించనుందని, అయితే సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తౌరాని చెబుతున్నారు.