»   » బాలీవుడ్లో లంగరేసిన సెక్సీ లంకిణి (ఫోటోలు)

బాలీవుడ్లో లంగరేసిన సెక్సీ లంకిణి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్లో ఈ మధ్య విదేశీ భామల జోరు పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. అలాంటి తారల్లో ఒకరు శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బాలీవుడ్లో హీరోయిన్‌గా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న ఈ లంకిణి వీలైనంత విచ్చలవిడిగా అందాల విందుతో భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

హీరోయిన్ల మధ్య పెరుగుతున్న పోటీ, అవకాశాలు దక్కించుకోవాలనే ఆకాంక్ష, పబ్లిసిటీ మోజు....వెరసి పలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి విదేశీ తారలు అందాల ఆరబోతలో కాస్త హద్దులు మీరక తప్పని పరిస్థితి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా....టాలెంటు, అదృష్టం కలిసి ఉంటే తప్ప నిలదొక్కుకోలేని గడ్డుస్థితి.

శ్రీలంకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో 'అలాడిన్' అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జానె కహా సే ఆయా హై, హౌస్ ఫుల్ చిత్రాల్లో నటించినప్పటికీ.....ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం మహేష్ భట్ మూవీ 'మర్డర్-2' చిత్రం ద్వారానే.

జాక్వెలిన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, హాట్ ఫోటోలు స్లైడ్ షోలో.....

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా....అమ్ముడికి స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు. ఆయా చిత్రాల్లో సెకండ్ లీడ్ పాత్రలకు మాత్రమే పరిమితం అయింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న ‘రాయ్', ‘కిక్' చిత్రాల్లో నటిస్తోంది.

శ్రీలంక బ్యూటీ

శ్రీలంక బ్యూటీ

జాక్వెలిన్ ఫాదర్ శ్రీలంకన్, మదర్ మలేషయిన్. ఆమెకు 3 ఏళ్ల వయసున్నప్పుడే వారి కుటుంబం బహ్రెయిన్‌కు షిప్ట్ అయ్యారు. ఆమె బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచింది. ఆగస్టు 11, 1985న జాక్వెలిన్ జన్మించింది.

మోడలింగ్ రంగంలోకి...

మోడలింగ్ రంగంలోకి...

ఆస్ట్రేలియాలో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన జాక్వెలిన్...తర్వాత శ్రీలంక తిరిగొచ్చి మొడలింగ్, టెలివిజన్ రిపోర్టింగ్, హోస్టింగులో ప్రవేశించింది.

మిస్ శ్రీలంక యూనివర్స్

మిస్ శ్రీలంక యూనివర్స్

2006లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల పోటీల్లో మిస్ శ్రీలంక యూనివర్స్ కిరీటం దక్కించుకుంది.

తొలి కమర్షియల్ అప్పియరెన్స్

తొలి కమర్షియల్ అప్పియరెన్స్


2007లో శ్రీలంక సింగింగ్ సెన్సేషన్ బాతియా, సంతుష్ మ్యూజిక్ వీడియోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తొలి కమర్షియల్ అప్పియరెన్స్ ఇచ్చింది.

బాలీవడ్ ఎంట్రీ

బాలీవడ్ ఎంట్రీ


2009లో అలాడిన్ అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్. అయితే ఆమె నటించిన తొలి మూడు సినిమాలు ప్లాపయ్యాయి. అయితే నాలుగో సినిమా ‘మార్డర్-2' హిట్ కావడంతో అమ్మడుకి గుర్తింపు వచ్చింది.

పోటీని తట్టుకోలేకపోంది

పోటీని తట్టుకోలేకపోంది


బాలీవుడ్లో ఇతర హీరోయిన్ల నుండి పోటీ తట్టుకోవడంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫెయిలయింది. అందుకే ఆమెకు పరిశ్రమలో టాప్ పొజిషన్ దక్కడం లేదు.

అడపా దడపా అవకాశాలే

అడపా దడపా అవకాశాలే


ప్రస్తుతం జాక్వెలిన్ బాలీవుడ్లో అడపా దడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది.

ఉనికి కోసం

ఉనికి కోసం


సినిమా అవకాశాలు ఆశించిన రేంజిలో లేక పోవడంతో వాణిజ్య ప్రకటనలు, హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లు, ఫ్యాషన్ పెరేడ్లలో పాల్గొంటూ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది జాక్వెలిన్.

English summary
Jacqueline Fernandez Indian film actress, former model, and the winner of the Miss Sri Lanka Universe pageant of 2006. She is best known for her work in Hindi films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu