twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏక్.. దో.. తీన్‌: మరోసారి మారుమ్రోగనున్న ఎవరగ్రీన్ హిట్ సాంగ్!

    By Bojja Kumar
    |

    భారతీయ సినీ సంగీత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే పాటల్లో 'తేజాబ్'(1988) చిత్రంలోని 'ఏక్..దో..తీన్' సాంగ్ ఒకటి. అప్పట్లో ఈ పాటకు మాధురి దీక్షిత్ అదిరిపోయే స్టెప్పులేశారు. తాజాగా ఈ పాట మరోసారి బాలీవుడ్లో మారుమ్రోగబోతోంది. బాలీవుడ్ మూవీ 'బాగీ-2'లో ఈ పాటను రీమిక్స్ చేయబోతున్నారు.

     అపుడు మాధురి దీక్షిత్... ఇపుడు జాక్వెలిన్

    అపుడు మాధురి దీక్షిత్... ఇపుడు జాక్వెలిన్

    ఒరిజనల్ సాంగులో మాధురి దీక్షిత్ ఈ పాటలో నటించారు. రిమిక్స్ సాంగులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

     బాగీ-2

    బాగీ-2

    బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘బాఘి 2'లో ఈ పాటను రీమిక్స్ చేయబోతున్నారు. ఈ చిత్రం 2016లో వచ్చిన ‘బాఘి' చిత్రానికి సీక్వెల్‌. మార్చి 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    మాధురి దీక్షిత్ తరహాలో రాణిస్తుందా?

    అప్పట్లో మాధురి దీక్షిత్ తన డాన్స్ పెర్ఫార్మెన్స్, హావ భావాలతో ఈ పాటను మరింత రసవత్తరంగా పండించారు. మరి ఆ స్థాయిలో కాక పోయినా ఆ పాటకు చెడ్డ పేరు రాకుండా జాక్వెలిన్ చేసినా చాలు అంటున్నారు విశ్లేషకులు.

    తెలుగులో 1..2.. 3

    ‘తేజాబ్ ' చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా ‘టూ టౌన్ రౌడీ' పేరుతో 1989లో రీమేక్ చేశారు. ‘ఏక్...దో..తీన్' పాటను తెలుగులో ‘1..2..3' పేరుతో అనువదించగా....అందులో అప్పటి స్టార్ హీరోయిన్ రాధ స్పెప్పులేశారు.

    English summary
    Jacqueline Fernandez got the nation dancing to her tunes as she recreated the iconic chartbusters 'Chalti Hai Kya 9 Se 12' and 'Oonchi Hai Building' for Judwaa 2. After winning the audience's hearts with Judwaa 2, who better than Jacqueline Fernandez to add her spark to the iconic Madhuri Dixit number 'Ek Do Teen'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X