»   » మొన్న టాప్‌లెస్.. నేడు సెక్సీ పోల్ డాన్స్.. జాక్వెలైన్ రచ్చ రచ్చ.. (వీడియో)

మొన్న టాప్‌లెస్.. నేడు సెక్సీ పోల్ డాన్స్.. జాక్వెలైన్ రచ్చ రచ్చ.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ తార జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఇటీవల హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్నది. కొద్ది రోజుల క్రితం కాస్మోపాలిటన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌‌లో టాప్‌లెస్‌గా కనిపించిన జాక్వెలైన్ ఇప్పుడు పోల్ డాన్స్‌తో సందడి చేసింది. జెంటిల్మన్ సినిమా కోసం చిత్రీకరించిన పోల్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

సిద్ధార్థ్ కోసం పోల్ డ్యాన్స్

సిద్ధార్థ్ కోసం పోల్ డ్యాన్స్

శ్రీలంక దేశస్తురాలైన జాక్వెలైన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నది. కిక్ చిత్రంలో సల్మాన్ సరసన నటించిన ఆమెకు సరైన విజయాలు లభించకపోవడంతో మరింత కష్టపడాల్సి వస్తున్నది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి జెంటిల్మన్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం షూటింగ్ చివరి రోజున పోల్ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు.

ప్రత్యేకంగా నైట్ క్లబ్ సెట్

ప్రత్యేకంగా నైట్ క్లబ్ సెట్

ఈ పాట కోసం ముంబైలో ప్రత్యేకంగా నైట్ క్లబ్‌ సెట్‌ను వేశారు. ఈ పాట పేరు చంద్రలేఖ. ఈ పాట కోసం జాక్వెలెన్ ప్రత్యేకంగా శిక్షణ పొందినట్టు సమాచారం. ఈ పాటకు ఆదిల్ షేక్ కొరియోగ్రఫీని అందించారు. కపూర్ అండ సన్స్ చిత్రంలోని కార్ గయీ ఛుల్ అనే పాటతో ఆదిల్ షేక్ పాపులర్ అయ్యాడు.

అదరగొట్టిన జాక్వెలైన్ ఫెర్నాండెజ్

జాక్వెలైన్‌కు శిక్షణ ఇచ్చిన ప్రముఖ పోల్ డ్యాన్సర్ రోక్సోలానా చుబెంకో ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తున్నది. హాట్ హాట్‌గా పక్కా ప్రొఫెషనల్‌గా జాక్వెలైన్ పోల్ డ్యాన్స్ చేయడం విశేషం. జాక్వెలైన్ పూర్తిస్థాయిలో ఎలా అదరగొట్టిందో ఇక తెర మీద చూడాల్సిందే అంటున్నారు దర్శక, నిర్మాతలు

తెలుగు దర్శకుల క్రియేటివిటి..

తెలుగు దర్శకుల క్రియేటివిటి..

జెంటిల్మన్ సినిమాకు తెలుగు దర్శకులు కృష్ణ డీకే, రాజ్ నిడిమోరు దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్, డీకే ఇద్దరూ అమెరికాలోని భారత సంతతికి చెందిన వారు. ఈ దర్శకద్వయం హిందీలో పలు చిత్రాలను నిర్మించారు. 2009లో 99 సినిమాతో మొదలైన వీరి బాలీవుడ్ ప్రయాణం, షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ చిత్రాలను రూపొందించారు. తెలుగులో డీ ఫర్ దోపిడి అనే సినిమాను కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న ఏ జెంటిల్మన్ చిత్రం ఆగస్టు 25న విడుదలకు సిద్ధమవుతున్నది.

English summary
The Sri Lankan beauty and Bollywood star Jacqueline Fernandez has done pole dance to seduce Sidharth Malhotra in her upcoming film A Gentleman. Jacqueline shared a video of herself pole dancing like a pro on Instagram. The song, called Chandralekha, was shot in Mumbai over three days on a set designed as a nightclub. The song has been choreographed by Adil Shaikh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu