శృంగార విహారం ('మర్డర్ 2' ప్రివ్యూ)
ఇమ్రాన్ హష్మి, జాక్వలైన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్ లో రూపొందిన 'మర్డర్ 2' ఈ రోజు (శుక్రవారం) విడుదల అవుతోంది. మల్లికా షెరావత్ హీరోయిన్ గా 2004లో వచ్చిన 'మర్డర్' చిత్రానకి ఇది సీక్వెల్. ముఖేష్ భట్ నిర్మించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. వరుస హత్యలు సాగిస్తున్న హంతకుణ్ని పట్టుకొనే అంశం ఈ కథలో కీలకం. అతడి హత్యలు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? అతని మానసిక స్థితి ఏమిటన్నది ఈ కథలో చూపిస్తున్నారు. అర్జున్ భగవత్, ప్రియ అనే పాత్రలు ఇందులో కీలకం. వారి చుట్టూనే చిత్రం నడుస్తుంది. ఈ చిత్రానికి కథను సమకూర్చిన మహేష్‌భట్ మాట్లాడుతూ ''శృంగారపరమైన కథాంశమే ఇది. అయితే సున్నితమైన భావోద్వేగాలకీ, మానసిక స్థితిగతులకీ చోటుంది'' అంటున్నారు. ప్రశాంత్ నారాయణ్, సులఘ్న పాణిగ్రాహి, సుధాంశు పాండే ముఖ్య పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











