బ్రహ్మీ కామెడీ విశ్వరూపం!(జెఫ్పా ప్రివ్యూ)
హైదరాబాద్ : ఆయన స్టార్ హీరో కాదు....కానీ ఆయనకు స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింది. స్టార్ హీరోలు తమ సినిమాలకు ఏ పాత్రైనా తక్కువైతే అడ్జెస్ట్ అవుతారేమో కానీ....ఆయన పాత్ర లేకుంటే మాత్రం సినిమా చేయరు. అవసరం అయితే ఆయన డేట్స్ కోసం తమ డేట్స్ సర్దుకుంటారు. ప్రేక్షకులను మెప్పించడానికి హీరో ఎన్ని గిమ్మిక్కులు చేసినా థియేటర్లో కేరింతలు వినపడతాయో లేదో కానీ, ఆయన ఫేసు కనిపిస్తే చాలు ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆనదందం, కేరింతలతో కూడిన ఉత్సాహం. ఆయనే టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం.
ఎవరో హీరోగా రూపొందుతున్న సినిమాలో బ్రహ్మానందం నటిస్తేనే పరిస్థతి ఇలా ఉంటే....ఆయనే హీరోగా కామెడీ ప్రధానంగా సినిమా వస్తే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'జెఫ్పా' పొజిషన్ కూడా అంతే. ఈ రోజు ఈచిత్రం విడుదల కాబోతోంది.
'నో రేప్, నో మర్డర్, నో కిడ్నాప్, నో మాఫియా, బట్ స్టిల్ హి మోస్ట్ వాంటెడ్'' అనేది దీనికి క్యాప్షన్లు. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో సమానందంగా బ్రహ్మానందానికి క్రేజ్ ఉంది. దర్శకుడు వెన్నెల కిషోర్ ఈచిత్రాన్ని ఎలా మరిచారో ఈ రోజు తేలనుంది.
నటీనటులు : బ్రహ్మానందం, అలీ, ఫిష్ వెంకట్, శ్రావణ్
నిర్మాత : రమేష్ వర్మ
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : రాజా
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
కథ, స్క్రీప్ ప్లే, దర్శకత్వం : వెన్నెల కిషోర్


Click it and Unblock the Notifications












