బ్రహ్మీ ‘జెఫ్ఫా’ ఓవర్సీస్ రైట్స్ వారికే..
టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో 'జెఫ్పా' చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. జెఫ్ఫా' అనే పదాన్ని తెలుగు చిత్రాల్లో బ్రహ్మానందం ఉపయోగించినంతగా ఎవరూ యూజ్ చేసి ఉండరు... ఇప్పుడు అదే 'జెఫ్ఫా' అనే సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించడం విశేషం.. ''నో రేప్, నో మర్డర్, నో కిడ్నాప్, నో మాఫియా, బట్ స్టిల్ హి మోస్ట్ వాంటెడ్'' అనేది దీనికి క్యాప్షన్లు.
ఈ చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్, డివిడి-విడిసి రైట్స్ 'బ్లూ స్కై సినిమాస్' సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం టీజర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం టెర్రరిస్టు జఫ్పార్ ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్ంరలో ఇంకా అలీ, వేణు మాధవ్, ఇతర కమెడియన్లు కూడా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. రమేష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ కామెడీ చిత్రంలో తమని భాగస్వాములను చేసినందుకు ఎగ్జిబిటర్లు నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications












