రిలీజ్‌కు రెడీ అవుతున్న బ్రహ్మానందం ‘జెఫ్పా’
టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో 'జెఫ్పా' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. జెఫ్ఫా' అనే పదాన్ని తెలుగు చిత్రాల్లో బ్రహ్మానందం ఉపయోగించినంతగా ఎవరూ యూజ్ చేసి ఉండరు... ఇప్పుడు అదే 'జెఫ్ఫా' అనే సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించడం విశేషం. . ''నో రేప్, నో మర్డర్, నో కిడ్నాప్, నో మాఫియా, బట్ స్టిల్ హి మోస్ట్ వాంటెడ్'' అనేది దీనికి క్యాప్షన్లు.
చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా....విడుదల విషయంలో ఆలస్యం అవుతూ వచ్చింది. అసలు కొంత కాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి చర్చ సాగలేదు. అంతా ఆ సినిమా గురించి మరిచి పోతున్న సమయంలో సినిమాను త్వరలో రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు ఈ చిత్ర దర్శకుడు వెన్నెల కిషోర్.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు లాస్ట్ స్టేజ్‌కు చేరుకున్నాయని, ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయని....ఫిబ్రవరి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు శ్రావణ్, అలి, ఫిష్ వెంకట్ ముఖ్య మైన పాత్రలు పోషిస్తున్నారు.
అనుప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందించారు. రమేష్ వర్మ ఈ చిత్రానికి నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో సమానందంగా బ్రహ్మానందానికి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది దర్శక నిర్మాతల నుంచి.


Click it and Unblock the Notifications











