జగడం, ఆర్య-2 నిర్మాత తండ్రి మృతి
సినీ నిర్మాత సోంపల్లి జయదేవ్ హైదరాబాదులోని ఆయన నివాసంలో రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 56 సం.లు. నెల్లూరు జిల్లాకు చెందిన జయదేవ్ తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలు నిర్మించారు. సొంతం, జగడం, ఆర్య-2, చలాకీ తదితర చిత్రాలను నిర్మించిన ఆయన కుమారుడు ఆదిత్యబాబుని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ సినిమాలు తీశారు. జయదేవ్ మృతి పట్ల తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.ఆయన మృతికి ధట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











