హాలీవుడ్ చిత్రానికి తెలుగు డైరక్టర్
తెలుగులో దర్శకుడు జగదీశ్వరరెడ్డి త్వరలో ఓ హాలీవుడ్ చిత్రానికి డైరక్షన్ చేయనున్నారు. ఆయన ఈ విషయాలను మీడియాకు వివరించారు. తను ఇంతకుముందు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కామాగ్ని' చిత్రాన్ని 'కామతంత్ర' పేరుతో హాలీవుడ్‌లో రూపుదిద్దుకోనుందని, ఈ సినిమాకి తను దర్శకత్వం వహిస్తున్నానని దర్శకనిర్మాత జగదీశ్వరరెడ్డి చెప్పారు. 'కామాగ్ని' చిత్రానికి తేజ (దర్శకుడు) ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. ఈ సినిమా వివరాలను జగదీశ్వరరెడ్డి మీడియాకు వెల్లడిస్తూ 'నేను తీసిన 'కామాగ్ని' చిత్రాన్ని యూ ట్యూబ్‌లో ఆరు లక్షల మంది చూశారు. ఈ విషయం తెలుసుకున్న లాస్ఏంజిలిస్‌లోని ఎక్స్‌ప్రెస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాలో హాలీవుడ్‌లో నిర్మించడానికి ముందుకు వచ్చింది.
భారతీయ కథాంశం కలిగినది కావడంతో దర్శకత్వ బాధ్యతలు నాకే అప్పగించారు. కేరళలో, రామోజీ ఫిలింసిటిలో చిత్ర నిర్మాణం జరుగుతుంది. డిసెంబర్‌లో ప్రారంభమయ్యే ఈ చిత్రం పేరు 'కామతంత్ర'. హాలీవుడ్‌కి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తారు. కథాంశం ఏమిటంటే పోలీసులకు పట్టుబడిన కరుడు కట్టిన ఓ తీవ్రవాది ప్రమాదవశాత్తు పాత విషయాలన్నీ మరిచిపోతాడు. అతన్ని తిరిగి మాములు మనిషిని చేస్తే కానీ తీవ్రవాద కార్యకలాపాలు వెల్లడి కావు. అందుకే ఆ బాధ్యతని ఓ యువతికి అప్పగిస్తారు. సెక్స్ థెరపీ ద్వారా ఆమె ఆ టెర్రరిస్ట్‌ని మార్చే ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం కేరళ వెళ్లి ఆమె కామతంత్ర విద్యను కూడా నేర్చుకుంటుంది. ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది' అన్నారు.


Click it and Unblock the Notifications











