'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ కన్ఫర్మ్
'జగదేకవీరుడు - అతిలోకసుందరి' సీక్వెల్ చేస్తారంటూ కొంతకాలంగా వినపడుతోందే. అయితే ఇప్పుడా వార్త అధికారికంగా అశ్వనీదత్ మీడియాకు వెళ్ళడించారు. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో కె.రాఘవేంద్రరావు రూపొందించిన 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాంతో ఆ చిత్రం సీక్వెల్ తయారు చేయాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. మే 9తో రెండు దశాబ్దాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి రెండో భాగాన్ని తెరకెక్కించడానికి అశ్వనీదత్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ "వైజయంతీ మూవీస్ పతాకంపై 'జగదేకవీరుడు..' కి సీక్వెల్‌ను రూపొందిస్తాం. ఫిబ్రవరిలో షూటింగ్ ను ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను జనవరిలో ప్రకటిస్తామని అన్నారు. ఇక ఈ చిత్రానికి రామ్ చరణ్ హీరోగా ఉండే అవకాశముందని, ఇళయరాజానే సంగీతానికి తీసుకోబోతున్నారని సమచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











