పార్టీ చేసుకున్న చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్వినీదత్ (ఫోటోస్)

By Bojja Kumar

సినీ నిర్మాణ ప్రక్రియకి నిలువెత్తు గ్లామరు, గ్రామరుని ఆపాదించిన అపురూప చలన చిత్ర కావ్యం ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి'. ఊహకే అందరి బడ్జెట్టుతో, అనూహ్యమైన కథతో రంగులతెరని రంజింపజేసిన ఓ ప్రభంజనం. ఓ సంచలన చిత్రం ...1990, మే 9న విడుదలైన ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి'. ఈ చిత్రం విడుదలైన 25 సంవత్సరాలు పూర్తయింది.

ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ చిత్ర హీరో చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 25 ఏళ్ల కిందట సినిమా విడుదలైన తర్వాత చోటు చేసుకున్నపరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

‘జగదేక వీరుడు-అతిలోక సుందరి' చిత్రం చిత్రం విడుదలైనపుడు పెను తుఫాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. ఊళ్లకు ఊళ్లు తుపానులో తూలిపోతున్నాయి. ఆ బీభత్సంలో అశ్వినీదత్ సినిమా విడుదలకు పూనుకుంటే అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఆ ప్రకృతి వైపరీతంలో అసలు ప్రదర్శనలు జరుగుతాయా? నిర్మాతకి నూకలు దక్కుతాయా అన్న ప్రశ్నలు పరిశ్రమను ఉక్కిరి బిక్కిరి చేసాయి. అశ్వినీదత్ మాత్రం సినిమాపై నమ్మకంతో ధైర్యంగా విడుదల చేసారు. వర్షాన్ని లెక్కచేయకుండా అప్పట్లో థియేటర్లకు జనం క్యూకట్టారు. తుఫాను వారం రోజులు కొనసాగితే వైజయంతి తుఫాను ఊరూరా రెండువందల రోజులు హోరెత్తింది. సినిమాకు మొదట ప్లాప్ టాక్ వచ్చింది. గతి లేని వీరుడు-మతిలేని సుందరి అంటూ కొందరు విమర్శించారు. అయితే సినిమా అనూహ్యంగా పుంజుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది.

జగదేక వీరుడు అతిలోక సుందరి సెలబ్రేషన్స్

జగదేక వీరుడు అతిలోక సుందరి సెలబ్రేషన్స్

జగదేక వీరుడు అతిలోక సుందరి సెలబ్రేషన్స్ లో చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్వినీదత్

ప్లాన్ అన్నారు

ప్లాన్ అన్నారు

"రిలీజైన రోజు..ఆంధ్రాలో సైక్లోన్. అంతా మా సినిమా సూపర్ ఫ్లాప్ అన్నారు. అయితే కొద్దిరోజులు గడిచింది. సినిమా సునామీ తరహా కలెక్షన్స్ తో దుమ్ము రేపింది.

రీ రిలీజ్

రీ రిలీజ్


ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిజిటలైజ్ చేసి రీరిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

సూపర్బ్

సూపర్బ్

ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులు ముఖ్యంగా చిత్ర ఛాయాగ్రాహకుడు అజయ్ విన్సెంట్, సంగీత దర్శకుడు ఇళయారాజా అందించిన పాటలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఈ చిత్రంలోని ఏడు పాటలూ శ్రోతలను బాగా అలరించాయి. ముఖ్యంగా అబ్బనీ తియ్యనీ దెబ్బ వంటి పాటలు ఇప్పటికీ ఆ పాటలు జనం నోళ్లలో నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

విజయంలో కీలక పాత్ర

విజయంలో కీలక పాత్ర

స్టెప్పులతో చిరంజీవి అలరిస్తే దేవకన్యగా శ్రీదేవి, దుష్ట మాంత్రికుడుగా అమ్రిష్ పురి నటన ఈ చిత్రానికే హైలెట్. ఈ చిత్రానికి కురిసిన ప్రశంసల జల్లులో దర్శకుడు రాఘవేంద్రరావు తడిసి ముద్దయ్యారు. ఇక స్వర్గీయ జంధ్యాల రాసిన మాటలు ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X