'జగద్గురు శ్రీ షిరిడీ సాయిబాబా'
ఎస్. ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై జి. రామాకృష్ణ దర్శకత్వంలో బి.వి.రెడ్డి టైటిల్ పాత్రలో సాయిబాబాగా నటించిన "జగద్గురు శ్రీ షిరిడీ సాయిబాబా" పాటలను ఫిలిమ్ ఛాంబర్‌లో ప్రదర్శించారు. షిర్డీ సాయిబాబా జీవితంలోని కొన్ని ఘట్టాలను తీసుకుని ఈ సినిమాను రూపొందించామని బి.వి.రెడ్డి పాటల ప్రదర్శన సందర్భంగా అన్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ సందర్భానుసారంగా ఉంటాయని చెప్పారు.
ఈ సినిమాను మోహన్‌బాబు, బి.గోపాల్ చూసి బాగుందని కితాబిచ్చారని బి.వి.రెడ్డి వెల్లడించారు. వచ్చేనెల రెండోవారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సుమన్, నాగబాబు, బ్రహ్మాజీ, శివక్రిష్ణ, నారాయణరావు తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ఇంతకుముందు వచ్చిన సాయిబాబా సినిమాల్లో ఎవరూ టచ్‌చేయని పాయింట్‌ను ఎంచుకున్నామన్నారు. మానవీయకోణం తీసుకుని సామాజిక అంసాల ప్రధానం కథను తయారు చేశామని చెప్పారు. ఈ చిత్రానికి ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని ఆయన తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం: లలిత్ సురేష్, కెమేరా: శ్రీనివాసరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి. రామకృష్ణ.


Click it and Unblock the Notifications











