Free Download online: ధనుష్, విద్యాబాలన్‌కు షాకిచ్చిన తమిళ్ రాకర్స్.. గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్!
లాక్‌డౌన్, కర్ఫ్యూలతో వినోదానికి దూరమైన ప్రేక్షకులకు ఓటీటీలో శరణ్యంగా మారాయి. పలు ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డగా నిలుస్తున్నాయి. అయితే వినోదాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తున్న సినీ వర్గాలపై పైరసీ వెబ్‌సైట్లు దాడులకు పాల్పడుతున్నాయి. జూన్ 18న రిలీజైన జగమే తాంధిరమ్ (జగమే తంత్రం), షేర్ని, ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్‌పై పైరసీ రక్కసి ప్రతాపం చూపింది. ఈ వివరాల్లోకి వెళితే..

నెట్‌ఫ్లిక్స్‌లో జగమే తంత్రం
విలక్షణ నటుడు ధనుష్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన జగమే తాంధిరమ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. లండన్‌లో తమిళ శరణార్థులు, గ్యాంగస్టర్ డ్రామా అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ కాటుకు గురైంది. దీంతో నిర్మాతలు, యూనిట్ ఆందోళనకు గురవుతున్నారు. పైరసీని ప్రోత్సహించవద్దని కోరుతున్నారు

అమెజాన్‌లో విద్యాబాలన్ షేర్ని
ఇక విద్యాబాలన్ నటించిన షేర్ని చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకొన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అయితే అమెజాన్‌లో రిలీజైన కొద్ది గంటలకే పైరసీకి గురైంది.

ఆహాలో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్
ఇక తెలుగుదనం, తెలుగు సినిమాలకు అడ్డాగా మారిన ఆహా యాప్‌లో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ రిలీజైంది. ప్రియదర్శి, నందిని రాయ్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ కూడా సోషల్ మీడియా ప్రసార సాధనాల్లో లీక్ అయింది. దీంతో నిర్మాతలకు పైరసీ ముఠా సవాల్ విసిరినట్టయింది.
Recommended Video

తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్, టొరెంట్స్‌లో
దేశవ్యాప్తంగా సినీ వర్గాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్న పైరసీ రక్కసికి అడ్డుకట్టపడలేకపోతున్నది. జగమే తాంధిరమ్, షేర్ని, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ చిత్రాలు యదేచ్చగా హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్స్ ఫ్రీగా లభ్యమవుతున్నాయి. తమిళ్ రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రూల్జ్, టొరెంట్స్ లాంటి సైట్లలో ఈ మూడు చిత్రాలు లీక్ అయ్యాయి. ఫ్రీ డౌన్ లోడింగ్ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











