Jagame thandhiram twitter review: ధనుష్ యాక్టింగ్ సూపర్బ్.. కార్తీక్ సుబ్బరాజు చేజేతులా..
విలక్షణ నటుడు ధనుష్ నటించిన జగమే తంత్రం (తమిళంలో జగమే తాందిరమ్) చిత్రం జూన్ 18వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంది. అయితే ఈ సినిమాపై నెటిజన్లు ట్విట్టర్‌లో వెల్లడించిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

గ్యాంగ్‌స్టర్ మూవీగా
అంతర్జాతీయ వలసవాదుల కథా నేపథ్యంగా గ్యాంగ్‌స్టర్ చిత్రంగా జగమే తంత్రం తెరకెక్కింది. మంచి పాయింట్‌తో తెరకెక్కినప్పటికి అంతగా ఆకట్టుకోలేకపోయింది. శరణార్థుల సమస్యను ఎలివేట్ చేసుందుకు ప్రయత్నించారు. ఈ చిత్రంలో ధనుష్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది నెటిజన్ అభిప్రాయపడ్డారు.

కథలో కొత్తదనం కొరవడి..
జగమే తాంధిరమ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథలో కొత్తదనం కొరవడింది. సురులీ పాత్రలో ధనుష్ ఆకట్టుకొన్నాడు. మ్యూజిక్ బాగుంది. కార్తీక్ సుబ్బరాజు నిరాశపరిచాడు అంటూ నెటిజన్ తన భాధను పంచుకొన్నాడు.

అంతర్జాతీయ శరణార్థుల కథతో
జగమే తాంధిరమ్ చిత్రం ధనుష్ వన్ మ్యాన్ షో. నాటుగా ఉండే దేశీ యాక్షన్ మూవీ. అంతర్జాతీయ శరణార్థుల ఎమోషన్స్ ఆధారంగా తెరక్కింది. కంప్లీట్ మాస్ మసాల ఎంటర్‌టైన్‌మెంట్. ధనుష్ ఎక్సలెంట్ ఫెర్ఫార్మెన్స్. మాస్ సినిమా లవర్స్‌కు నచ్చుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ధనుష్ ఫెర్ఫార్మె్న్స్
కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన జగమే తాంథిరమ్ చిత్రం అసంపూర్తిగా ఉంది. సినిమాలో కొన్ని లోపాలు, కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి. సురులీ పాత్రలో కనిపించిన ధనుష్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. శ్రీలంక తమిళ శరణార్థుల బాధలు సినిమాలో ఎమోషనల్‌గా ఉన్నాయి.

బలహీనమైన కథ..
జగమే తాంధిరమ్ చిత్రం ఫస్టాఫ్ యావరేజ్. సెకండాఫ్ యావరేజ్‌గా కూడా లేదు. బలహీనమైన కథ, స్లోగా సాగే స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్ సరిగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్. ధనుష్ ఒక్కడే ఈ సినిమాను కాపాడటానికి అవకాశం ఉంది. ఎంతో ఊహించుకొంటే బిగ్ డిజపాయింట్‌మెంట్ తప్పదు అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

విలన్ షేడ్స్ పాత్రలో
జగమే తాంధిరమ్ చిత్రం విషయానికి వస్తే.. ధనుష్ మరోసారి పక్కా మాస్ మూవీలో నటించాడు. సురులీ పాత్రలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Recommended Video

తమిళ వలసవాదుల సమస్యతో
జగమే తాందిరమ్ చిత్రం ఎంగేజింగ్‌గా ఉంది. గ్యాంగ్‌స్టర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలంకకు చెందిన తమిళ వలసవాదుల సమస్యను ఎత్తి చూపడం అభినందనీయం. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫి విజువల్‌గా సూపర్బ్.


Click it and Unblock the Notifications











