పవన్ కళ్యాణ్ కొడుకుకు అగ్ని ప్రమాదం.. స్పందించిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ల పుత్రుడు మార్క్ శంకర్ సింగపూర్ లో తన స్కూలింగ్ ను పూర్తి చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని పవన్ కళ్యాణ్ కు సమాచారం అందింది. దీంతో ప్రెస్ నోట్ కూడా విడదల చేశారు. బాలుడు మార్క్ శంకర్ కు ఏం జరిగిందా అని అందరూ ఆందోళన పడుతున్నారు.
మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురికావడంతో పవన్ అభిమానులు కంగారు పడుతున్నారు. అతనికి ఏం జరిగిందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్బంగా బాలుడికి చికిత్స అందిస్తున్నారని మాత్రం ప్రకటన విడుదల చేశారు. అయితే మార్క్ శంకర్ చదువుతున్న సింగర్ పూర్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో 8 ఏళ్ల మార్క్ శంకర్ ఆ మంటల్లో చిక్కుకుపోయాడు. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది అతన్ని బయటికి తీసుకొచ్చారు.

స్కూల్ లోని ఓ భవంతిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ నుంచి పిల్లలందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. చేతులు, కాళ్ల చర్మం కాలిపోయిందని సమాచారం. అలాగే దట్టమైన పొగవల్ల ఊపిరితిత్తులు గాయపడ్డట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉండింది. మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది.
అయితే, పవన్ కళ్యాణ్ తనయుడు అగ్ని ప్రమాదానికి గురవడంతో ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. అగ్ని ప్రమాదం జరగడంతో సానుభూతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే స్పందించారు. బాలుడికి ప్రమాదం జరిగిందని తెలిసి బాధపడ్డాను. పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలువాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. రాజకీయం పరంగా ఎలాంటి విబేధాలు ఉన్నా పవన్ కళ్యాణ్ కొడుకుకు సానుభూతి వ్యక్తం చేయడం గమనార్హం.
ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు కూడా ఈ అగ్ని ప్రమాదంపై స్పందించారు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నారా లోకేష్ కూడా ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇవ్వాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన ముగిశాక, కురిడి టెంపుల్, దంబ్రిగూడలోని జనాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నాక సింగపూర్ కు బయల్దేరుతున్నారు. ఇక మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10న అన్నా లెజినోవాకు జన్మించారు.


Click it and Unblock the Notifications











