జైలు నుంచి తప్పించుకున్న జగన్!

By Bojja Kumar

హైదరాబాద్: జగన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. కొంపతీసి ఈ విషయం జైల్లో ఉన్న వైఎస్ జగన్ గురించి అనుకునేరు.... అస్సలు కాదు. మేం మాట్లాడుతుంది ఈ నెల 15న విడుదల కాబోతున్న 'జగన్' సినిమా గురించి. శివ, సంజన, సరయు ప్రధానపాత్రధారులుగా వెంకన్నబాబు యేపుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జగన్'. ఐ.ఎస్.జె ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం శాఖమూరి మల్లికార్జున రావు, తోట హేమచందర్ నిర్మాతలు.

వాస్తవానికి ఈచిత్రం ఫిబ్రవరి నెలలోనే విడుదల కావాల్సి ఉండగా ఆర్థిక కష్టాల కారణంగా జగన్ విడుదల వాయిదా పడింది. జగన్ చిత్రానికి తొలుత జగన్ నిర్దోషి అని నామకరణం చేశారు. అయితే ఇది వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఉందనే విమర్శలు రావడంతో నిర్దోషి అనే పదాన్ని తొలగించారు.

తాజాగా ఈ నెల 15న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.... జైలు నుంచి తప్పించుకున్న జగన్, అతను నిర్దోషి అంటూ వీడియో ట్రైలర్ విడుదల చేసారు. ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేక పోయినా... జగన్ గురించిన ప్రస్తావన సినిమాకు ఎంతో కొంత ప్లస్సవుతుందని భావిస్తున్నారు.

ఈ చిత్ర హీరో శివ తండ్రి శాఖమూరి మల్లిఖార్జునరావు సూపర్‌ స్టార్‌ కృష్ణ బంధువు. పద్మాలయ స్టూడియో మేనేజర్‌గా కూడా పని చేసారు. కృష్ణ సూపర్‌హిట్‌ సినిమా 'ఖైది రుద్రయ్య' సినిమాలోని 'పువ్వెత్తి కొట్టమాకు పురుషోత్తమా' అనే పాటను రీమిక్స్‌ చేసారు. ఇందులో హీరో పేరు 'జగన్‌', జైళుకు వెళ్ళినతను ఎలా 'నిర్ధోషి'గా బయటకు వచ్చాడన్నదే చిత్ర కథ.

శృతిరెడ్డి, దీపాలిసింగ్, ప్రసాద్‌బాబు, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు, సత్యంరాజేష్, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయరామ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: వందేమాతరం, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకన్నబాబు యేపుగంటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X