జగన్ సీఎం కావాలి -జగపతిబాబు
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందాక సీఎం పీఠంపై వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోజురోజుకు ఆందోళన వృద్దుతం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సినీ ప్రముఖులు కూడా జగన్ కు మద్దతుగా స్వరం కలుపుతుండటం విశేషం. నిన్న మొన్న ప్రముఖ నటుడు నాగార్జున, రాజశేఖర్-జీవిత, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి లు జగన్ కు మద్దుతుగా ప్రకటనలు చెయ్యగా, తాజాగా మ్యాన్లీ హీరో జగపతిబాబు కూడా ఈ జాబితాలో చేరిపోయారు.
వైయస్ మృతిపై ఇటీవల విలేఖరులతో మాట్లాడిన జగపతిబాబు "డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణం నన్నెంతో షాక్ కు గురిచేసింది, రోజూ నవ్వుతూ కనిపించే వ్యక్తి కనుమరుగయ్యారంటే బాధగా వుంది. ప్రజల మనిషిగా అందరి హృదయాల్లో నిలచిన వ్యక్తి మనను వదలి వెళ్లారంటే ఊహకే కష్టంగా వుంది. ఆయన వారసుడిగా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చాలన్నా, ఆయన సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాలని" ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











