»   » వైఎస్ జగన్‌పై సినిమా... ‘జగన్నాయకుడు’!

వైఎస్ జగన్‌పై సినిమా... ‘జగన్నాయకుడు’!

Posted By:
Subscribe to Filmibeat Telugu
YS Jagan
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సినిమా రాబోతోందా? అంటే అవుననే అంటున్నారు తెలుగు సినీ వర్గాలు. అగ్ర కథానాయకులందరికీ హిట్స్ ఇచ్చిన సీనియర్ దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కే ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పే సినిమా అని ప్రత్యేకంగా చెప్పక పోయినా....ఆయన చెప్పిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. వాటి వివరాలను ఆయన వెల్లడిస్తూ రాజకీయ నేపథ్యంలో 'జగన్నాయకుడు'అనే చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు.

తాత, కొడుకు, మనవడు... ఇలా మూడు తరాలకు చెందిన కథ ఇది. తాత కోరికను మూడో తరంలో మనవడు నెరవేర్చడం ఈ చిత్ర కథాంశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత వి.ఎ.పద్మనాభరెడ్డి కథను అందించారని పిసి రెడ్డి తెలిపారు.

అలాగే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అనూరాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై నిర్మించే రొమాంటిక్ లవ్ స్టోరీకి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు పి.సి.రెడ్డి చెప్పారు. అంతా కొత్త వారితో కూడా ఓ సినిమా చేస్తున్నాను. శ్రీనివాసరావుగారి ప్రోద్బలం దీనికి ముఖ్య కారణం. ఈ చిత్రానికి కథకుడు కూడా ఆయనే. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.

English summary
Senior director P.C.Reddy started direction again after long time. ‘Jaganayakudu’ movie will come in his direction. This story belongs to Grandfather, Father, Son.. Like this three generations will be involved in story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu