వైఎస్ జగన్ సమక్షంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. స్వీకరించడం ఖాయమే!
Recommended Video
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయకేతనం ఎగరేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక చంద్రబాబు ఓటమితో టీడీపీ పార్టీని గాడిలో పెట్టే సామర్థ్యం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ లో మాత్రమే ఉండనే ప్రచారాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపైకి రానున్నారనే వార్త సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ముగ్గురూ ఎందుకు కలుస్తున్నారు? సందర్భం ఏంటి? వివరాల్లోకి పోతే..

ముఖ్యమంత్రి సీటెక్కాక జగన్
గత కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి కావాలనే తపనతో ఉన్న జగన్ ఇటీవలే ఆ ఫీట్ సాధించాడు. దీంతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ప్రజా సంక్షేమ పథకాలు మొదలైన అన్నింటిలో తన మార్క్ చూపిస్తూ అడుగు వేస్తున్నాడు వైఎస్ జగన్. ఈ మేరకు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన పనులను కూడా వేగంగా పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యారట జగన్.

పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం గతంలో 2014- 2015- 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డుల విజేతలని ప్రకటించింది. కానీ ఇప్పటివరకూ ఆ పురస్కారాల్ని గ్రహీతలకు అందించలేదు. ఈ లోగా ఇప్పుడు ప్రభుత్వం మారింది.

త్వరలోనే నంది అవార్డుల పంపిణీ.. జగన్ నిర్ణయం
కాళాత్మక రంగంలో ఇచ్చే ప్రోత్సహకాలు ఆపడం సరికాదని భావించిన ముఖ్యమంత్రి జగన్.. వెంటనే నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయినట్లు సమాచారం. అతిత్వరలోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని తెలుస్తోంది.

జగన్ సమక్షంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
కాగా 2014 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా బాలయ్య (లెజెండ్) ఎంపికయ్యారు. అదేవిధంగా 2015 సంవత్సరానికి గాను మహేష్ బాబు (శ్రీమంతుడు), 2016 సమ్వత్సరానికి గాను జూనియర్ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. వీరికి అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉంది. ఈ లెక్కన కొద్ది రోజుల్లోనే వైఎస్ జగన్ సమక్షంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సదరు అవార్డులను స్వీకరించనున్నారన్న మాట.


Click it and Unblock the Notifications