twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జగన్మోహిని' సెప్టెంబర్ 25న విడుదల

    By Staff
    |

    గ్లామర్ నటి నమిత టైటిల్ పాత్రలో రాజా, మీరాచోప్రా జంటగా మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్.మురళి నిర్మిస్తున్న జానపద కథా చిత్రం 'జగన్మోహిని'. ఎస్.కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై శ్రోతల ఆదరణ చూరగొంటోంది. దసరా కానుకగా ఈనెల 25న ఈ చిత్రానికి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    పాతికేళ్ల క్రితం బి.విఠలాచార్య దర్శకత్వంలో సంచనల విజయం సాధించిన 'జగన్మోహిని' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. అప్పట్లో జయమాలినిని టైటిల్ పాత్ర పోషించగా నరసింహరాజు కథానాయకుడుగా నటించారు. ఒరిజనల్ వెర్షన్ స్టోరీలైన్ మాత్రమే తీసుకుని ఇవాల్టి జనరేషన్ కు తగట్టుగా అత్యుత్తమ సాంకేతిక విలువులు, గ్రాఫిక్ వర్క్ తో మోడ్రన్ గా ఈ 'జగన్మోహిని' చిత్రాన్ని ఖర్చుకు రాజీ పడకుండా రూపొందించినట్టు నిర్మాత మురళి తెలిపారు. ఇందులో చాలా గ్రాఫిక్స్ ఉన్నాయనీ, సినిమాను మూడు ఐలాండ్స్ లో సెట్స్ వేసి తీశామనీ, అండర్ వాటర్ వర్క్ కూడా సినిమాకి హైలైట్ అవుతుందనీ తెలిపారు. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ విడుదల తర్వాత రెండు భాషల్లోనూ సంచలన విజయం ఖాయమనే నమ్మకం తమకుందన్నారు. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికే ఆడియో పరంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోందని చెప్పారు. ఈ సినిమా అనుకోగానే గ్లామర్, టాలెంట్ పుష్కలంగా ఉన్న నమిత పేరే తమకు గుర్తొచ్చిందనీ, ఆ పాత్రకు చక్కటి న్యాయం చేసిందని అన్నారు. అలాగే తెలుగు హీరో రాజాను తమిళ పరిశ్రమకు ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామని చెప్పారు. రాజా హ్యాండ్ సమ్ రాజకుమారుడుగా నటించగా, మిరాచోప్రా రాజకుమారిగా నటించిందన్నారు. సినిమాలో ఓపినింగ్ సన్నివేశమే ప్రేక్షకులను అబ్బరపరుస్తుందని, వడివేలు కామెడీ అద్భుతంగా పడిందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నరసింహరాజు, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X