twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూసి వణికిపోయాను: జగపతిబాబు

    By Srikanya
    |

    ''మొన్న 'క్షేత్రం' ప్రివ్యూ చూసి ఒకలాంటి వణుకుతో థియేటర్ బయటికొచ్చాను. పెద్దగా భక్తిలేని నాకే ఒకరకమైన భావన కలిగిందంటే, సంపూర్ణ భక్తుల పరిస్థితి విడిగా చెప్పక్కర్లేదు'' అని జగపతిబాబు ఉద్వేగంగా అన్నారు. జగపతి హీరోగా ప్రియమణి ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'క్షేత్రం'. టి.వేణుగోపాల్ దర్శకత్వంలో జి.గోవిందరాజు నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...ఈ సినిమాకి అసలు హీరో లక్ష్మీ నరసింహాస్వామి. ఆయన తర్వాతే మా పాత్రలు. ఇది ఏడుపు సినిమా కాదు. కానీ ప్రేక్షకులు కంటతడి పెట్టకుండా ఉండలేరు. అలాగని భక్తి సినిమా కాదు. అయినా చేతులు జోడించకుండా ఉండలేరు.

    క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశంలో అయితే అందరూ స్క్రీన్‌కు దణ్ణం పెట్టేస్తారు. అంత గొప్పగా ఉంటుంది. ఫాంటసీతో పాటు అనుక్షణం ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా ఈ కథ విన్నాను. కథ బాగుంది. కానీ, దర్శకుడు ఎలా తీస్తాడోనని అపనమ్మకం. అయితే వేణుగోపాల్ సినిమాను అద్భుతంగా తీశాడు. 'క్షేత్రం' విషయంలో ఏదో మ్యాజిక్ జరిగిందనే అనిపిస్తుంది. 'అరుంధతి' తరహా సినిమా అవుతుంది. విజువల్‌గా వండర్ అన్పిస్తుంది అన్నారు.

    కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఆదిత్యమీనన్, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, అక్కినపల్లి రాజ్‌కుమార్, బ్రహ్మాజీ, అన్నపూర్ణమ్మ, హేమ, శివపార్వతి తదితరులు ఇతర ముఖ్యపాత్రధారులు. మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: కోటి, కెమెరా: ఎమ్వీ రఘు, కళ: రఘు కులకర్ణి, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్కినపల్లి విజయ్‌కుమార్.

    English summary
    Balaji Movie Makers is producing a movie titled “Kshetram” directed by T.Venugopal with Jagapathi Babu, Priyamani and Shyam in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X