ఆమెతో మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.. ప్రియమణిపై జగపతి బాబు కామెంట్స్
జగపతి బాబు, ప్రియమణిల కాంబోలో వచ్చిన సినిమాలు, ఆ సమయంలో ఈ ఇద్దరిపై వచ్చిన రూమర్లు అన్నీ ఇన్నీ కావు. ప్రియమణి వరుసగా జగపతి బాబుతో కలిసి నటించడంతో గుసగుసలు మొదలయ్యాయి. వరుసగా ఐదు చిత్రాల్లో జంటగా కనిపించి అందర్నీ మెప్పించారు. అయితే తాజాగా జగపతి బాబు బర్త్ డే సందర్భంగా ప్రియమణి స్పెషల్ విషెస్ అందించింది. అంతే కాకుండా మళ్లీ ఎప్పుడు నటిద్దామని అందరి ముందే అడిగేసింది.

ఇద్దరూ అలా..
ప్రస్తుతం ప్రియమణి, జగపతి బాబు ఇద్దరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇందులో ఈ ఇద్దరూ దూసుకుపోతోన్నారు.ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ మొదటి సీజన్‌లో ప్రియమణి కనిపించి అందరినీ కట్టిపడేసింది. గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. మరో వైపు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్, సైడ్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్‌లో దుమ్ములేపుతున్నాడు.
నిఖితా శర్మ గ్లామర్ షో.. లేటేస్ట్ ఫోటోషూట్‌తో హంగామా!

ప్రియమణి ఫుల్ బిజీగా..
ప్రియమణి ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఫ్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. అంతేకాకుండా వెంకటేష్ హీరోగా వస్తోన్న నారప్ప సినిమాలోనూ ప్రియమణి నటిస్తోంది. అసురన్ సినిమాలో మంజూ వారియర్ పోషించిన పాత్రను తెలుగులో ప్రియమణి పోషిస్తోంది.

జగపతి బాబు ఇలా..
జగపతి బాబు మాత్రం ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిన్న తాను ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఎఫ్సీయూకే చిత్రం విడులైంది. అంతే కాకుండా ఇంకా ఎన్నో చిత్రాలు విడుదలకు సిద్దంగాఉన్నాయి. అయితే ఇంత బిజీగా ఉన్న జగపతి బాబుతో ప్రియమణి ఇప్పుడు జోడి కట్టడం అంటే మామూలు విషయం కాదు.

మళ్లీ ఎప్పుడూ..
జగపతి బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రియమణి అసలు విషయం అడిగేసింది. నేను ఆయనతో ఐదు సినిమాల్లో నటించాను.. జగ్స్ మళ్లీ మనం కలిసి ఎప్పుడూ నటిద్దామని అడిగేసింది. దానికి సమాధానంగా.. ఆమెతో మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.. పక్కింటి అమ్మాయిలా ఎంతో సరదాగా ఉంటుంది. మంచి వ్యక్తి.. ఎప్పుడైనా సరే కలిసి నటించాలని ఉంటుంది..అయితే నేను కూడా అదే అడుగుతుంటాను.. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చూడాలని జగపతి బాబు అన్నాడు.


Click it and Unblock the Notifications











