జగపతిబాబు ప్రవరాఖ్యుడా?

By Staff

Jagapathi Babu
ఆడవారి వంక కోరికతో చూడనివారిని ప్రవరాఖ్యుడంటూరు. అయితే జగపతిబాబు ప్రవరాఖ్యుడని పిలవబోతున్నారు. పెళ్ళయిన కొత్తలో దర్శకుడు మదన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలోనూ ఆ హిట్ పెయిర్ ప్రియమణి, జగపతిలను కంటిన్యూ చేస్తున్నాడు. మదన్ దర్శకుడే కాక రచయిత కావటంతో అతనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ మధ్య అతను ఉదయ్ కిరణ్ హీరోగా గుండె ఝల్లుమంది చిత్రాన్ని డైరక్ట్ చేసాడు.

అయితే అది ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. అనంతరం అజయ్ హీరోగా ఈల అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తాడని వినపడింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే ఓ సినిమా నిర్మిస్తున్న ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ వారు ద్వితీయ ప్రయత్నంగా దీనిని తీయనున్నారు. ఇక ఈ చిత్రం కథ వినగానే మిగతావన్నీ ప్రక్కన పెట్టి జగపతి బాబు వెంటనే డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఆ నమ్మకాన్ని మదన్ మరో సారి నిలబెట్టుకుంటాడని ఆశిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మదన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X