twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పని లేని వెధవలు అంతే, డబ్బు లేకున్న హ్యాపీగా కూతురు పెళ్లి చేశా: జగపతి బాబు

    By Bojja Kumar
    |

    ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తిగా, జెన్యూన్‌ పర్సనాలిటీగా టాలీవుడ్ స్టార్ జగపతి బాబుకు మంచి పేరుంది. తన వద్ద డబ్బు ఉన్న సమయంలోనూ, ఏమీ లేని సమయంలో ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. ఇటీవల ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కూతురు పెళ్లి సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు.

    వాళ్లతో సమస్య వచ్చిన మాట నిజమే

    వాళ్లతో సమస్య వచ్చిన మాట నిజమే

    మా అమ్మాయి పెళ్లి సమయంలో చిన్న ఇష్యూ అయిన మాట నిజమే. కానీ దాన్ని నేనో పెద్ద సమస్యగా భావించలేదు. రిలేటివ్స్ వల్ల ఏదో ప్రాబ్లం వచ్చిందని రాశాను కానీ అది నిజం కాదు. బయటి వాళ్ల దగ్గర నుండి వచ్చింది. ***కులం వాళ్ల దగ్గర నుండి వచ్చిందే తప్ప బంధువుల నుండి వచ్చిన సమస్య కాదు.. అని తెలిపారు.

    పనిలేని వెధవలు అంతే

    పనిలేని వెధవలు అంతే

    ఇక్కడ ఎవడి గొడవ వాడు చూసుకోలేరు... కొందరికి అందరి విషయాలు కావాలి. పని లేని వెధవలందరూ అంతే కదా! అందుకే నేను వారిని పట్టించుకోలేదు. నా కూతురికి నచ్చినట్లు తను సంతోషంగా ఉండటానికి ఏం కావాలో అది చేశాను అని జగపతి బాబు తెలిపారు.

    డబ్బు లేకున్నా సంతోషంగా చేశాను

    డబ్బు లేకున్నా సంతోషంగా చేశాను

    మా అల్లుడు అమెరికన్. వారు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఆ పెళ్లి సమయానికి నా దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు. అల్లుడు అమెరికన్ కావడం వల్ల డబ్బు సమస్య రాలేదు. అక్కడి నుండి అల్లుడితో పాటు వాళ్ల తల్లిదండ్రులు వచ్చారు. కట్నం లేదు, మా అమ్మాయి కూడా ఆర్భాటం లేని పెళ్లి కావాలంది. మా ఇంట్లోనే చేశాం. మా వాళ్లతో.. బెస్ట్ పీపుల్‌తో చేశాం. చాలా సంతోషంగా జరిగింది అని జగపతి బాబు తెలిపారు.

    అలా చేయడం ఇష్టం లేదు

    అలా చేయడం ఇష్టం లేదు

    కూతురు పెళ్లి ఘనంగా చేయలేదనే బాధ లేదు. ఎందుకంటే అలా చేయాలనే ఆలోచన కూడా నాకు లేదు. మ్యారేజ్ ఫంక్షన్ అనేది పబ్లిక్ ఫంక్షన్ అని నేను భావించడం లేదు. ఇది ప్రైవేట్ ఫంక్షన్ అని నా ఫీలింగ్. మన ఇంటి ఆడపిల్లను మరొకరి ఇంటికి పంపిచడం. ఎన్నో భావోద్వేగాలు, ఎంతో ప్రేమ ఉంటుందన్నారు.

    కాస్లీ మ్యారేజీలు వల్గారిటీ ఆఫ్ వెల్త్

    కాస్లీ మ్యారేజీలు వల్గారిటీ ఆఫ్ వెల్త్

    పెళ్లికి 200 మంది ఉంటే చాలు. వీళ్లందరూ ఉంటే వీళ్లను చూసుకోవడానికే సరిపోతుంది. సీఎం రావడం, వారు వీరు రావడం బాగానే ఉంటుంది. ఎవరు వస్తే ఏంటి? ఫైనల్ గా మనం బావుండాలి. మన ఫ్యామిలీ బావుండి. వీళ్లందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి గంటల తరబడి వారు నిలబడి ఉండటం ఒక పనిష్మెంట్ లాంటిది. వెరీ కాస్ల్రీ మ్యారేజెస్ వల్గారిటీ ఆఫ్ వెల్త్(సంపద వికృత రూపం) అని నా ఉద్దేశ్యం.... అని జగపతి బాబు అన్నారు.

    English summary
    Jagapathi Babu said he does not think that marriage is a public function, it is a private function. He also said that, "his daughter's marriage witnessed some problems. It is the nature of some outsiders to create the issue."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X