»   » కుటుంబం మాత్రమే: స్పష్టం చేసిన జగపతి బాబు

కుటుంబం మాత్రమే: స్పష్టం చేసిన జగపతి బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నీ కష్ట సుఖాల్లో నీ వెన్నంటి ఉండేది, తోడుగా ఉండేది, ధైర్యం చెప్పేది నీ ఫ్యామిలీ మాత్రమే అంటూ.... ప్రముఖ నటుడు జగపతి బాబు తన సోషల్ నెట్వర్కింగులో ఓ పోస్టు చేసారు. దాంతో పాటో ఓ ఫోటో కూడా పెట్టారు.

Its only your family that stands by you in your thick and thin

Posted by Jaggu Bhai on Wednesday, July 1, 2015

విమర్శలు పట్టించుకోలేదు...
ఆ మధ్య జగపతి బాబు కూతురు అమెరికా శ్వేత జాతీయుడిని ప్రేమించిన పెళ్లాడిన సంగతి తెలిసిందే. కూతురు కోరిక మేరకు జగపతి బాబు అండ్ ఫ్యామిలీ ఈ పెళ్లికి అంగీకరించి అంగరంగ వైభవంగా చేసారు. అయితే జగపతి కూతురు అమెరికా వ్యక్తిని పెళ్లాడటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసారట.

Jagapathi Babu about his family

జగపతి బాబు ఈ విషయమై మాట్లాడుతూ.....వంశ‌మైన వీర‌మాచ‌నేని అంటే క‌మ్మ కులంలో పెద్ద ఫ్యామిలీ అని అలాంటిది త‌న కుమార్తెకు ఓ అమెరికా అల్లుడితో పెళ్లి జ‌రిపించ‌డం ఏంట‌ని కొంద‌రు నన్ను ప్ర‌శ్నించార‌ు. వారికి నేను ఒకటే చెప్పాను. మా అమ్మాయి..ఆ అబ్బాయి ఇష్ట‌ప‌డ్డారు. పెళ్లి చేస్తున్నాం. ఇందులో కులాల ప్ర‌స్తావ‌న ఎందుకుని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కులాల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని జగపతి బాబు అన్నట్లు తెలుస్తోంది. నాకు వారసులు లేరు. నాతోనే వీరమాచినేని వంశీ అంతం అవుతుందని అంటున్నారు. నేను చనిపోయాక ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూడను. అయినా ఈ కాలంలో కూడా కులాల ప్ర‌స్తావ‌న అంతా ట్రాష్ అని జగపతి బాబు కొట్టి పారేసినట్లు సమాచారం.

English summary
"Its only your family that stands by you in your thick and thin" Jagapathi Babu said.
Please Wait while comments are loading...