నా భార్య చిరునవ్వుతో కనిపిస్తుంది.. సూసైడ్ చేసుకుంటాం అన్నారు, తాగేసి రమ్మని నాన్నే!

ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు అద్భుతమైన చిత్రాలు చేశారు. గాయం, అంతఃపురం వంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశారు. జీవితంలో తీవ్రమైన ఇబ్బందులని ఎదుర్కొన్నారు. ఇబ్బందుల నుంచి బయటపడ్డ జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా విజృంభిస్తున్నారు. ఇటీవల వచ్చిన ప్రతి బ్లాక్ బస్టర్ చిత్రంలో జగపతి బాబు పాత్ర కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఆ సినిమా చేస్తే సూసైడ్ చేసుకుంటాం అన్నారు

ఆ సినిమా చేస్తే సూసైడ్ చేసుకుంటాం అన్నారు

నటుడిగా తాను గతంలోనే ఎన్నో రిస్క్ లు చేసానని జగపతి బాబు తెలిపారు. హీరోగా విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో అంతఃపురం లాంటి సినిమా చేయాలనీ ఎవరూ కోరుకోరు. కానీ నేను చేశా. ఆ సినిమాలో నేను హీరోని కాదు. అంతఃపురం చిత్రంలో నటిస్తే సూసైడ్ చేసుకుంటాం అని కొంతమంది నా అభిమానులు చెప్పిన మాటలు కూడా నాకు గుర్తున్నాయి.

మైక్‌లో క్షమించమని అడిగా

మైక్‌లో క్షమించమని అడిగా

తాను టెంపర్ కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని జగపతి బాబు తెలిపారు. సెట్స్ లో ఓ కెమెరా మెన్ ని గట్టిగా అరిచేశా. మూడురోజుల తరువాత నాదే తప్పు అనిపించి సెట్స్ లో మైక్ తీసుకుని అందరిముందు సారీ చెప్పానని జగపతి బాబు అన్నారు.

నాన్నే హాఫ్ బాటిల్ పంపేవారు

నాన్నే హాఫ్ బాటిల్ పంపేవారు

షూటింగ్ లో తాగి నటించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నకు జగపతి బాబు స్పందించారు. తాగి నటించడం ప్రతి రోజూ చేసే పని కాదు. అంతఃపురం చిత్రంలో అలా చేయవలసి వచ్చింది. నేను నటించిన అడవిలో అభిమన్యుడు చిత్రంలో కొండలు ఎక్కుతూ, వాగుల్లో నడుస్తూ నటించాలి. దీనితో నాన్నగారే హాఫ్ బాటిల్ పంపి తాగేసి రారా అని చెప్పేవారు.

ఇండస్ట్రీలోనే బెస్ట్ కారు

ఇండస్ట్రీలోనే బెస్ట్ కారు

ఒకప్పుడు ఇండస్ట్రీలోనే బెస్ట్ కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో వాదనని జగపతి బాబు అన్నారు. కారుపై నాకు మోజు ఏంటి అని ఒకరోజు చాలా తక్కువ ధరకు అమ్మేశా. నాకు ఎలాంటి ఇబ్బందులు లేని సమయంలోనే ఈ పని చేశా అని జగపతి బాబు అన్నారు.

సంజయ్ దత్ కష్టాలతో పోల్చుకుంటే

సంజయ్ దత్ కష్టాలతో పోల్చుకుంటే

నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ ప్రభావాన్ని కుటుంబంపై పడనీయలేదు. నా భార్యకి ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించు చాలు అని చెప్పా. అలాగే చేసేది. నాకు ఆ సంతోషం చాలు. ఇటీవలే సంజు చూశా. సంజయ్ దత్ కష్టాలతో పోల్చుకుంటే నేను పడ్డది కష్టాలే కాదు అని జగపతి బాబు అన్నారు.

ఎన్టీఆర్ చాలా బాగా చూసుకున్నాడు

ఎన్టీఆర్ చాలా బాగా చూసుకున్నాడు

నేను అందరికి చిన్న పిల్లాడిలా కనిపిస్తానో, అమాయకుడిలా కనిపిస్తానో తెలియదు. నా స్నేహితుడు అర్జున్ నన్ను చాలా బాగా చిన్నపిల్లాడిలా చూసుకునేవాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అలాగే చేస్తున్నాడు అని జగపతి బాబు తెలిపారు. సెట్స్ లో బాబు తిన్నాడా, బాబు ఎం చేస్తున్నాడు అని ఎప్పుడూ అడుగుతూనే ఉంటాడని తెలిపారు.

అర్జున్‌పై వచ్చినవి ఆరోపణలే కాదు

అర్జున్‌పై వచ్చినవి ఆరోపణలే కాదు

అర్జున్ పై ఇటీవల వచ్చిన మీటూ ఆరోపణలపై జగపతి బాబు స్పందించారు. అసలు అర్జున్ పై వచ్చినవి ఆరోపణలే కాదు. 100 మంది సెట్స్ లో ఉండగా ఎవరు ఏం చేస్తారు అని జగపతి బాబు అనాన్రు అన్నారు. అర్జున్ నా ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేయడం లేదు. నేనుప్పుడూ ఆడవాళ్లకు మద్దత్తుగా నిలుస్తాను. కానీ మీటూ అనేది ఒకటి దొరికింది అని వాడేసుకునే చేస్తున్నారు అంటూ జగపతి బాబు ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X