నాకు పునర్జన్మే : విలన్ రోల్‌పై జగపతిబాబు స్పందన
హైదరాబాద్ : ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది మహిళా అభిమానులను సంపాదించుకున్న జగపతి బాబు....త్వరలో సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
14 రీల్స్ ఎంర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో జగపతిబాబు విలన్‌గా నటించబోతున్నారు. జగపతిబాబు వాయిస్, లుక్స్ ఈ చిత్రానికి బాగా ప్లస్సవుతాయని అంటున్నారు. ఉన్నట్టుండి జగపతి విలన్ పాత్రల వైపు మళ్లడంతో అంతా షాకయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.
'ఈ మధ్య నేను కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ చేసాను. కెరీర్‌ను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నేను చేయబోతున్న విలన్ పాత్ర నాకు పునర్జన్మ లాంటిది' అన్నారు. 'బాలకృష్ణ తనకు మంచి స్నేహితుడు, అతనితో కలిసి పని చేయడం అంటే ఇష్టం. ఒక మంచి బ్యానర్, మంచి డైరెక్టర్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. స్టోరీలో ఎన్నో ప్రధానాంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాను' అని జగపతి బాబు వెల్లడించారు.
మహిళా అభిమానులను అప్ సెట్ అవుతారుగా అని ప్రశ్నించగా....నా నిర్ణయం కొందరిని అప్ సెట్ చేయొచ్చు. కానీ నా కెరీర్ గురించి కూడా ఆలోచించాలి. ఈ పాత్ర చేయడంతో ఎంతో పాసిటివ్‌గా ఉన్నాను. ఈ పాత్రలో ప్రజలను నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని జగపతిబాబు సమాధానం ఇచ్చారు.
ఇప్పటి వరకు హీరోగా, ఇతర ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కనిపించిన జగపతిబాబు.....తాజాగా విలన్ పాత్రలు చేయడానికి సిద్ధం అవడం చర్చనీయాంశం అయింది. ఆయనకు హీరోగా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి జగపతి బాబు చేస్తున్న ప్రయత్నానికి ప్రేక్షకులను రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications












