»   » నమ్మక ద్రోహీ, ఉయ్యాలవాడ గురువు: "సైరా"లో జగపతి బాబు, అమితాబ్ పాత్రల వివరాలివే

నమ్మక ద్రోహీ, ఉయ్యాలవాడ గురువు: "సైరా"లో జగపతి బాబు, అమితాబ్ పాత్రల వివరాలివే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Amitabh Bachchan And Jagapathi Babu Charecters Details In "SYERA"

తన 150 వ చిత్రం ఖైదీ తో చిరంజీవి చాలా పాజిటివ్ గా ఇండస్ట్రీ లోకి తిరిగి అడుగు పెట్టారు. చిరు ని ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ థియేటర్ లలో చూడడం కోసం జనాలు ఎగబడ్డారు. ఇప్పుడు కొత్తగా 151 వ చిత్రం కి రంగం సిద్ధం చేసిన చిరంజీవి ఆ సినిమాకి సైరా నరసింహా రెడ్డి అంటూ పేరు పెట్టాడు.

ఈ సినిమాలో అమితాబ్ దగ్గర నుంచీ నయనతార వరకూ చాలానే తారాగణం ఉంది. అయితే మ్యాన్లీ హీరో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్య కాలం లో లెజెండ్ లాంటి సినిమాల ద్వారా విలన్ గా ఎదిగిన జగపతి బాబు ఇప్పుడు సైరా లాంటి బాలీవుడ్ రేంజ్ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి సెలక్ట్ అవ్వడం విశేషం.

జగపతిబాబు పాత్ర

జగపతిబాబు పాత్ర

ఇక 'సైరా.. నరసింహారెడ్డి'లో నటించబోతున్న జగపతిబాబు పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మకంగా వుంటూనే వెన్నుపోటు పొడిచి బ్రిటీష్ వాళ్లకి నరసింహారెడ్డి ఆచూకీ తెలియజేసే నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడట.

చిరుకి గురువు పాత్రలో

చిరుకి గురువు పాత్రలో

ఈ చిత్రంలో బాలీవుడ్‌ ‘మెగాస్టార్‌' అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నారు. అయితే ఇందులో ఆయన చిరుకి గురువు పాత్రలో కన్పించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. సినిమాలో ఆంగ్లేయులను తరిమికొట్టాలని బిగ్‌బీ నరసింహారెడ్డికి ప్రతిక్షణం హితబోధ చేస్తుంటారట.

అమితాబ్‌ పాత్రే కీలకం

అమితాబ్‌ పాత్రే కీలకం

ఈ సినిమాలో మిగతా నటుల కంటే అమితాబ్‌ పాత్రే కీలకమని తెలుస్తోంది. మొత్తంమీద రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'సైరా.. నరసింహారెడ్డి'లో ఇంకా ఎవరెవరు ఏయే పాత్రల్లో నటించనున్నారో మరికొద్దిరోజుల్లోనే క్లారిటీ రావచ్చేమో.

కేర‌ళ‌లో భారీ సెట్

కేర‌ళ‌లో భారీ సెట్

ఇక‌, త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా కోసం కేర‌ళ‌లో భారీ సెట్ నిర్మిస్తున్నార‌ని స‌మాచారం. సురేంద‌ర్ రెడ్డి నేతృత్వంలో ఈ సెట్ నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, పొల్లాచిలో తానే ద‌గ్గ‌రుండి సెట్ ప‌నుల‌ను సురేంద‌ర్ రెడ్డి చూసుకుంటున్నారు.

English summary
Jagapathi Babu and Amitabh Bachchan charecters Chiranjeevi’s upcoming Telugu historical drama Sye Raa Narasimha Reddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu