మరిన్ని అనుమానాలకు తావిస్తున్న జగపతి బాబు స్కిప్.. మహేష్, అనిల్ ట్వీట్స్ చూస్తుంటే!

విలక్షణ నటుడిగా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతూ హీరో మొదలుకొని ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగల సమర్థుడుగా పేరు తెచ్చుకున్నాడు సీనియర్ నటుడు జగపతిబాబు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో జగపతిబాబు రోల్ ఎంతో కీలకంగా ఉండటం చూస్తున్నాం. అలాంటిది మహేష్ బాబు 26 వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' నుంచి అకస్మాత్తుగా జగపతిబాబు తప్పుకోవడం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు జగపతిబాబు స్కిప్‌పై రకరకాల వార్తలు పుట్టుకురావడం, వాటిపై జగపతిబాబు స్పందించడం జరిగింది. అయితే తాజాగా మహేష్ బాబు, అనిల్ రావిపూడి చేసిన ట్వీట్స్ ఆయన తప్పుకున్నాడా? లేక తప్పించారా? అనే అనుమానాలకు ఊతమిస్తున్నాయి. ఇంతకీ ఆ ట్వీట్స్ ఏంటి? మహేష్, అనిల్ ఏమన్నారు? వివరాల్లోకిపోతే..

సరిలేరు నీకెవ్వరు.. జగపతిబాబు

సరిలేరు నీకెవ్వరు.. జగపతిబాబు

భరత్ అనే నేను, మహర్షి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న, కీలక పాత్రల్లో జగపతి బాబు, విజయశాంతి నటిస్తుందని ప్రకటించారు మేకర్స్. కానీ అనుకోకుండా ఇటీవలే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు జగపతిబాబు.

భిన్న కథనాలు.. రకరకాల చర్చలు

సరిలేరు నీకెవ్వరు నుంచి జగపతిబాబు తప్పుకున్నాడని తెలియగానే మీడియాలో భిన్న కథనాలు పుట్టుకొచ్చాయి. డైరెక్టర్ అనిల్- జగపతి బాబు మధ్య అభిప్రాయం బేధాలు వచ్చాయని, జగపతిబాబుని కావాలనే తప్పించారని రకరకాలుగా చర్చలు మొదలయ్యాయి. దీంతో వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు జగపతిబాబు.

ఎమోషనల్ అవుతూ జగపతిబాబు

తాను తప్పుకోవడంపై ఎమోషనల్‌గా స్పందిస్తూ ట్విట్టర్‌లో వీడియో పెట్టారు జగపతిబాబు. సినిమా అనేది తన ఫ్యామిలీ లాంటిది.. ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఇష్టం లేదని అన్నాడు జగపతిబాబు. అయితే ఒక క్లారిఫికేషన్ మాత్రం ఇస్తున్నానని, గత 33 ఏళ్లుగా నేను ఇలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు కానీ ఇప్పుడొచ్చింది అంటూ.. కొన్ని అనివార్య కారణాల వల్ల 'సరిలేరు నీకెవ్వరు'లో నటించలేక పోతున్నాని అన్నాడు. అంతే తప్ప తమపై వస్తున్న రూమర్స్‌లో నిజం లేదని పేర్కొంటూ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు జగపతి బాబు.

మహేష్ బాబు, అనిల్ రావిపూడి స్పందన

మహేష్ బాబు, అనిల్ రావిపూడి స్పందన

ఎమోషనల్ అవుతూ జగపతిబాబు పెట్టిన వీడియోపై స్పందించాడు మహేష్ బాబు. 'థాంక్యూ సార్.. మీరంటే మాకు ఎప్పటికీ ప్రేమ, గౌరవం ఉంటుంది' అని ట్వీట్ చేశాడు. అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ.. ''అర్ధం చేసుకున్నందుకు థాంక్స్ సార్.. ఎప్పటికీ మీరంటే గౌరవం'' అని ట్వీట్ చేశాడు. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ట్వీట్‌పై తిరిగి స్పందించిన జగపతి బాబు.. 'థాంక్స్ యు ఫర్ ది క్లారిఫికేషన్' అన్నాడు.

రెట్టింపైన అనుమానాలు

రెట్టింపైన అనుమానాలు

అనిల్ ట్వీట్ పై జగపతిబాబు స్పందించిన తీరు చూస్తుంటే.. ఈ సినిమా నుంచి జగపతి బాబు కావాలని తప్పుకోలేదని.. తప్పించిన మాట నిజమేనని అర్థమవుతోంది. మొత్తానికైతే జగపతిబాబు వీడియోతో ఈ వివాదం సద్దు మణుగుతుందనుకుంటే మరిన్ని అనుమానాలకు తావివ్వడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X