దర్శక,రచయిత మదన్ దర్శకత్వంలో జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళయిన కొత్తలో సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళి అదే కాంబినేషన్ మరో సినిమా రూపు దిద్దుకోనుంది. ఓ ఎన్నారై ప్రొడక్షన్ కంపెనీ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిజానికి మదన్ తన తర్వాత ప్రాజెక్టుగా అజయ్ హీరోగా ఈల చిత్రాన్ని రూపొందించే యోచనలో ఉన్నారు. అయితే ఉదయ్ కిరణ్ తో చేసిన గుండె ఝల్లుమంది...డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఆ ప్రయోగాన్ని విరమించుకున్నారు. ఇక జగపతి బాబు ఈ స్టోరి లైన్ చెప్పగానే వెంటనే ఒప్పుకుని డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తానని ప్రామిస్ చేసాడని సమాచారం.