ప్రియమణి వెనుక ఆ హీరో..?
'ప్రవరాఖ్యుడు' కాకుండా మరోసారి ప్రియమణి..జగపతిబాబుతో జతకట్టటం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. 'పెళ్ళయిన కొత్తలో' తర్వాత అదే దర్శకుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేయటం సెంటిమెంట్ గా, ప్రాజెక్టు క్రేజ్ గా ఫీలయ్యాడని సర్ధిచెప్పుకున్నారు. అయితే కుమార్ బ్రదర్శ్ సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న చిత్రంలోనూ ఈ జంటనే ఎన్నుకోవటం ఆసక్తి కలిగిస్తోంది. అయితే మొదట జగపతిబాబు ని హీరోగా అనుకుని ఆయన్ను కలవగా హీరోయిన్ గా ప్రియమణిని ప్రపోజ్ చేసాడని ఓ వర్గం గుసగుసలాడుతోంది. చేతిలో 'ప్రవరాఖ్యుడు' తప్ప ఒక్క సినిమా కూడా లేని ప్రియమణిని జగపతిబాబు ఆదుకోవటానికే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.
మిత్రుడు, ద్రోణ వరస పరాజయాలతో ప్రియమణి వెనకపడటం జీర్ణించుకోలేక ఇతర భాషల్లో ఆమె ట్రై చేస్తూండగా జగపతిబాబు ధైర్యం చెప్పి ఇలా ఆఫర్ ని ఇప్పిచ్చాడని అంటున్నారు. ఇది జగపతిబాబుకు కొత్త కాదని గతంలో కూడా తను అభిమానించే హీరోయిన్స్ కి తన ప్రక్కన చోటివ్వటం జరిగిందని మరికొందరు సీనియర్ దర్శక, నిర్మాతలు సమర్ధిస్తున్నారు. ఇక ఈ కొత్త చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ నెలలోనే షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యే ఈ చిత్రం ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, నాజర్, సుధ, ప్రగతి, సత్యం రాజేష్, యు.పి.రాజు, సుప్రీత్ తదితరులు నటించనున్నారు. సాంకేతిక నిపుణుల వివారాలు త్వరలోనే ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











