'జై బోలో తెలంగాణ'లో జగపతి బాబు పాత్ర ఏమిటంటే...
బందగి గోపన్న అనే పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. తెలంగాణ పోరాటానికి గుర్తుగా ఒక తండ్రి తన కొడుక్కి పెట్టుకొన్న పేరు అది. బందగి అంటే ఒక ముస్లిమ్, గోపన్న హిందువు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ..దర్శకుడు ఎన్.శంకర్...ముఖ్యంగా తెలంగాణ పోరాటానిది కులమత బేధాలు లేని చరిత్ర. అదే విషయాన్ని జగపతిబాబు పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం అంటున్నాం అన్నారు. ఇక జగపతి బాబును ప్రత్యేకంగా ఆ పాత్రకు ఎంచుకోవడానికి కారణం వివరిస్తూ...పోరుబాటలో పయనించి అమరుడయ్యే ఒక ఉద్యమకారుడి పాత్ర ఆయనది. ఆ పాత్రకి జగపతిబాబు అయితేనే న్యాయం చేస్తారనిపించింది. కథ వివరించగానే ఆయన ఒప్పుకొన్నారు. కవికి, కళాకారుడికి కుల, మత, ప్రాంత బేధాలుండవని నిరూపించారు అని ప్రశంసించారు. ఇక ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా అందరం కలసిమెలసి ముందుకెళదామన్నదే మా చిత్రం ద్వారా చెప్పబోతున్నాం అంటున్నారు ఎన్.శంకర్. 'జై బోలో తెలంగాణ' చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











