జగపతి బాబుకు ‘కళాభూషణ’ బిరుదు
తెలుగు హీరో జగపతిబాబు కళా భూషణ బిరుదాకింతులు కాబోతున్నాడు. ఈ నెల 11న టిఎస్ఆర్ కళాపరిషత్ ఆద్వర్యంలో నరసరావుపేటలో జరిగి కార్యక్రమంలో ఆయనకు ఈ సత్కారం జరుగనుంది. జగపతి బాబుతో పాటు నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ను కూడా సత్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి వాణిశ్రీ, బ్రహ్మానందం, గిరిబాబు, గీతాంజలి, రాజశేఖర్, జీవిత, ప్రియమణి, పరుచూరి వెంకటేశ్వరరావు, పి.విజయబాబు, తోటకూర ప్రసాద్, ముత్యవరపు మురళీకృష్ణలు విచ్చేయనున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర సహకార శాఖామాత్యులు కాసు వెంకట కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆర్.వి.రమణమూర్తి, పలువురు పాల్గొంటారని సుబ్బరామిరెడ్డి తెలిపారు.
సినిమా విషయాలకొస్తే....జగపతిబాబు, ప్రయమణి కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా 'క్షేత్రం' ఈ నెలలో విడుదల కాబోతోంది. నందమూరి తారకరత్న రీసెంట్ గా తన పేరుని 'ఎన్టీఆర్'గా మార్చుకుని 'నందీశ్వరుడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో జగపతి బాబు పోలీస్ ఆఫీసర్ గా ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











