జగపతి బాబు, భూమిక ‘ఏప్రిల్ ఫూల్’
హైదరాబాద్: జగపతి బాబు, భూమిక, రణధీర్, సృష్టి ప్రధాన పాత్రధారులుగా కర్తాళ్ ప్రొడక్షన్స్, సుధ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం 'ఏప్రిల్ ఫూల్'. కె.ఎస్.ఎ. దర్శకత్వంలో జి.ఎల్.శ్రీనివాస్, సీమా అజారుద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కొంపెల్లె ఫారెస్ట్ అకాడమీలో రణదీర్, సృష్టి, తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంత వరకు 70 శాతం షూటింగ్ పూర్తయిందని, అందులో భాగంగానే రెండు పాటలతో పాటు క్లైమాక్స్ చిత్రీకరించామని తెలిపారు. జర్నలిస్టు పాత్ర పోషిస్తున్న భూమికపై ఐదు రోజుల పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించామని వివరించారు.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ షూటింగ్ పార్ట్ పూర్తయ్యే వరకు నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 27 నుంచి జగపతిబాబు, గుల్షన్ గ్రోవర్ లపై కొన్ని ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిపారు. మిగిలిన మూడు పాటలలో ఒక పాటను హైదరాబాద్ లో, రెండు పాటలను అవుట్ డోర్‌లో చిత్రీకరించి, నవంబర్లో సినిమాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
పృథ్వి, రాళ్లపల్లి, వైజాగ్ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: బలభద్రపాత్రుని మధు, సంగీతం: బంటి, నిర్మాత: జి.ఎల్.శ్రీనివాస్, దర్శకత్వం: కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్.


Click it and Unblock the Notifications











