ఛ..ప్రియమణితో అలాంటిదేం లేదు
మా మధ్య ప్రేమ వ్యవహారం లేదు. చక్కటి స్నేహ బంధం మాత్రం ఉంది అంటూ ప్రియమణితో తన రిలేషన్ షిప్ గురించి జగపతిబాబు మీడియాకు చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటికి ప్రియమణితో నేను వరుసగా మూడు సినిమాలు చేశాను. నాలుగో సినిమా చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను అన్నారు. ప్రియమణికి,జగపతిబాబు మధ్య ఏదో జరుగుతోందంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపద్యంలో జగపతి బాబు ఇలా ఖండించారు. ప్రస్తుతం ప్రియమణి, జగపతి బాబు కలిసి నటించిన చిత్రం 'సాధ్యం' చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. కుమార్ బ్రదర్స్ నిర్మించిన ఆ చిత్రం ప్రమేషన్ కార్యక్రమాల్లో జగపతిబాబు పాల్గొంటున్నారు. ఇక ఇంతకుముందు జగపతిబాబు, ప్రియమణి కాంబినేషన్ లో పెళ్ళయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు చిత్రాలు వచ్చాయి. అందులో పెళ్లయిన కొత్తలో చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంటే ప్రవరాఖ్యుడు చిత్రం డిజాస్టర్ అయి నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక ఈ రెండు చిత్రాలకు మదన్ దర్శకుడు. ఇక ప్రియమణి ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో వస్తున్న గోలీమార్ చిత్రంలో గోపీచంద్ సరసన చేస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రెడీ అవుతున్న రావణ్ లోనూ కీలకమైన పాత్ర పోషిస్తోంది. అలాగే మొన్న సంక్రాంతికి ఆమె నటించిన శంబో శివ శంబో చిత్రం రిలీజైంది.


Click it and Unblock the Notifications











